స‌ల్మాన్ ‘ఇన్షా అల్లా’ వాయిదా.. ఏందుకంటే?

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 06:24 AM IST
స‌ల్మాన్ ‘ఇన్షా అల్లా’ వాయిదా.. ఏందుకంటే?

స‌ల్మాన్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ కాంబినేషన్ లో దాదాపు 20ఏళ్ల తర్వాత “ఇన్షా అల్లా” అనే మూవీ తెరకెక్కుతోంది. 1999 లో వీరిద్దరి కాంబినేషన్ లో  హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు  వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఇన్షా అల్లా సినిమాను ఈద్‌ కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని మూవీ యూనిట్ ప్ర‌క‌టించారు. 

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా ప‌డిందని స‌ల్మాన్ ఆదివారం (ఆగస్ట్ 25, 2019)న ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  2020 ఈద్‌ కి కచ్చితంగా మిమ్మ‌ల్ని త‌ప్ప‌క క‌లుస్తాన‌ని ట్వీట్‌ లో తెలిపాడు. సినిమాలో అలియా భ‌ట్ హీరోయిన్ గా తొలిసారి స‌ల్మాన్‌ తో జ‌త‌కట్టింది. 

ఇక ప్రస్తుతం స‌ల్మాన్ ద‌బాంగ్ 3, కిక్ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలియా కూడా ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా, క‌ళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉంది. ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈ సినిమా వాయిదా పడటానికి కారణం అలియానే అంటూ.. కొన్ని రోజులుగా అలియా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోందని. అందుకు ఇన్షా అల్లాకు బ్రేక్ ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.