Lucifer Remake : సల్మాన్ క్యారెక్టర్ అదేనంటగా..

‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌లో సల్మాన్ ఖాన్ చెయ్యబోయే రోల్ ఇదేనంటూ మరోసారి న్యూస్ స్ప్రెడ్ అవుతోంది..

Lucifer Remake : సల్మాన్ క్యారెక్టర్ అదేనంటగా..

Lucifer Remake

Lucifer Remake: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కొరటాల శివ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిలో చిరు – చరణ్ మీద ఒకటి, చరణ్ – పూజా హెగ్డేల పైన మరో సాంగ్ పిక్చరైజ్ చెయ్యనున్నారు.

Chiranjeevi : ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్..

ఇంతలోనే మలయాళ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ పట్టాలెక్కించేశారు చిరు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూట్ హైదరాబాద్, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆగస్టు 13న స్టార్ట్ అయ్యింది. చిరు మీద జైల్ సీన్స్ షూట్ చేస్తున్నారు. చిరు ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్లో ఛేంజెస్ చేశారు డైరెక్టర్ మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ అనే సాలిడ్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో క్యామియో రోల్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Salman Khan : చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సల్లూ భాయ్..

అయితే సల్లూ భాయ్ ఏ క్యారెక్టర్‌లో కనిపిస్తారు..? ఆయన కోసం ఏదైనా కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేస్తారా అనే డౌట్స్ వచ్చాయి. కట్ చేస్తే సల్మాన్ చెయ్యబోయే రోల్ ఇదేనంటూ మరోసారి న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. మలయాళం ‘లూసీఫర్’ పాపులర్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. సినిమా చివర్లో జాయెద్ మసూద్ క్యారెక్టర్లో వచ్చి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ని సర్‌‌ప్రైజ్ చేశారాయన. ఇప్పుడిదే రోల్ తెలుగులో సల్మాన్ ఖాన్ చెయ్యబోతున్నారని టాక్. ఇందుకు సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.

Chiranjeevi : జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో చిరంజీవి కోవిడ్ నిధి సేక‌ర‌ణ..