మేనల్లుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సల్మాన్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు..

  • Published By: sekhar ,Published On : April 1, 2020 / 10:30 AM IST
మేనల్లుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సల్మాన్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన మేనల్లుడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. సల్లూ భాయ్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ (మార్చి 30) సోమవారం అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ అబ్దుల్లాతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి సంతాపం ప్రకటించారు.
గతకొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్లా పరిస్థితి విషమించడంతో మృతి చెందారని వైద్యులు తెలిపారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్  చెల్లెలు కుమారుడు అబ్దుల్లా.. వృత్తి రీత్యా బాడీ బిల్డర్ అయిన అబ్దుల్లా మేనమామ సల్మాన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

కాగా సల్మాన్, అబ్దుల్లాల మధ్య మంచి అన్యోనత ఉందని బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. గతంలో సల్మాన్ అప్పుడప్పుడు మేనల్లుడితో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అబ్దుల్లా మరణ వార్త తెలిసి పలువురు బాలీవుడ్ సెటబ్రిటీలతో పాటు సల్మాన్ అభిమానులు నివాళులు అర్పించారు. లాక్‌డౌన్ కారణంగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో మేనల్లుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడం పట్ల సల్లూ భాయ్, కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారని పలు బాలీవుడ్ వెబ్‌సైట్లు కథనాలు రాశాయి..