Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. సల్మాన్‌కు రావణుడి కంటే అహం ఎక్కువ: లారెన్స్ బిష్ణోయ్

కృష్ణ జింకను చంపినందువల్ల సల్మాన్‌పై మా వర్గం వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు. తన చర్యల ద్వారా సల్మాన్ మా వర్గం వాళ్లను అవమానించాడు. మేం అతడిపై ఫిర్యాదు చేశాం. అతడు మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఈ విషయంలో ఎవరి మాటా వినను.

Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. సల్మాన్‌కు రావణుడి కంటే అహం ఎక్కువ: లారెన్స్ బిష్ణోయ్

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమన్నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. పంజాబీ సింగర్ సిద్ధూమూసే వాలా హత్యతోపాటు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. కాగా, కేసు విచారణల సందర్భంగా లారెన్స్ అనేక విషయాలు వెల్లడించాడు.

New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో

మీడియాతో కూడా సమాచారాన్ని పంచుకున్నాడు. గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు తాను ప్రయత్నించినట్లు, అతడిని బెదిరించినట్లు లారెన్స్ అంగీకరించాడు. అయితే, సల్మాన్‌ను లారెన్స్ లక్ష్యంగా చేసుకునేందుకు కారణం ఉంది. సల్మాన్ గతంలో కృష్ణ జింకను చంపినట్లుగా అతడిపై ఆరోపణలొచ్చాయి. దీనిపై కోర్టు విచారణ సైతం జరిగింది. కృష్ణ జింకల్ని బిష్ణోయ్ వర్గం వాళ్లు దైవంతో సమానంగా భావిస్తారు. అలాంటి జింకను సల్మాన్ చంపాడనే కారణంతో అతడిపై లారెన్స్ బిష్ణోయ్ పగ పెంచుకున్నాడు. ఎప్పడికైనా అతడ్ని చంపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఈ అంశంపై లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల కీలక విషయాలు చెప్పాడు.

New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

‘‘కృష్ణ జింకను చంపినందువల్ల సల్మాన్‌పై మా వర్గం వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు. తన చర్యల ద్వారా సల్మాన్ మా వర్గం వాళ్లను అవమానించాడు. మేం అతడిపై ఫిర్యాదు చేశాం. అతడు మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఈ విషయంలో ఎవరి మాటా వినను. ఎవరిపైనా ఆధారపడను. ఈ విషయంలో చిన్నప్పట్నుంచి అతడిపై నా మనసులో ద్వేషం ఉంది. సల్మాన్‌కు రావణుడికంటే అహం ఎక్కువ. మేం ఆ అహాన్ని తగ్గిస్తాం. బికనేర్‌లో మేం పూజించే గుడికొచ్చి సల్మాన్ క్షమాపణ చెప్పాలి.

Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం

మా దేవత సల్మాన్‌ను క్షమిస్తే మాత్రం మేం ఇంకేం అనబోం. సల్మాన్‌ ఖాన్‌ను చంపడమే నా లక్ష్యం. అతడి సెక్యూరిటీ తొలగించిన రోజు అతడ్ని చంపుతాం. సల్మాన్ క్షమాపణ చెబితే సమస్యే ఉండదు. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోతుంది. సల్మాన్‌కు కూడా సిద్ధూ మూసేవాలాలాగే అహంకారం ఎక్కువ’’ అని లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు. గత ఏడాది సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన తర్వాత లారెన్స్ గ్యాంగ్ సల్మాన్‌ను కూడా బెదిరించింది. సల్మాన్‌కు కూడా సిద్ధూలాంటి పరిస్థితి తప్పదని లేఖ ద్వారా హెచ్చరించారు.