Salman Khan : కంగనాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇకపై నేను ఒంటరిదాన్ని కాదు అంటూ పోస్ట్..

తాజాగా కంగనా చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కంగనా నటించిన ధాకడ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ సినిమా..................

Salman Khan : కంగనాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇకపై నేను ఒంటరిదాన్ని కాదు అంటూ పోస్ట్..

Kangana

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా, ఏం పోస్ట్ చేసినా వైరల్ అవ్వక తప్పదు. ఎలాంటి విషయం మీద అయినా నిర్భయంగా మాట్లాడేస్తుంది కంగనా. బాలీవుడ్ లోనే ఉంటూ బాలీవుడ్ మాఫియాపై బహిరంగంగానే విమర్శలు చేస్తుంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి ఖాన్స్ త్రయాన్ని సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటుంది. బాలీవుడ్ లో తనకి ఎవరూ సపోర్ట్ చేయలేదని చాలా సార్లు చెప్పింది. బాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన హీరోయిన్స్ లో కంగనా ఒకరు.

తాజాగా కంగనా చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కంగనా నటించిన ధాకడ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది కంగనా. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కంగనా నటించిన ధాకడ్ సినిమా ట్రైలర్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. సల్మాన్ ఖాన్ కంగనా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడని తెలిసి బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోయింది.

RGV : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి.. బాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ వ్యాఖ్యలు..

 

దీంతో సల్మాన్ ఖాన్ పోస్ట్ ని షేర్ చేస్తూ కంగనా.. ”నా దబాంగ్ హీరోకి ధన్యవాదాలు. మంచి మనసున్న వ్యక్తి. ఇకపై నేను ఈ ఇండస్ట్రీలో మరోసారి ఒంటరి అని చెప్పను. మెత్తం ధాకడ్‌ టీమ్‌ తరఫున మీకు ధన్యవాదాలు” అని తెలిపింది. ఇటీవల రంజాన్ సమయంలో కూడా సల్మాన్‌ ఇంట్లో జరిగిన ఈద్‌ పార్టీకి కంగనా హాజరైంది. ఆ సమయంలో బాలీవుడ్‌ లో చాలా మంది నటులు నాపై అభద్రతాభావంతో ఉన్నారని, వ్యక్తిగతంగా మాత్రం అందరూ ప్రశంసిస్తారు, కానీ బహిరంగంగా ప్రశంసించడానికి ఇష్టపడడం లేదు అని తెలిపింది. మరి బాలీవుడ్ నటులు కంగనా దారిలోకి వస్తున్నారా? కంగనా బాలీవుడ్ నటుల దారిలోకి వెళ్తుందా తెలియాలి.