Samantha : సమంత మలయాళంలో ఎంట్రీ.. అక్కడ కూడా లేడీ ఓరియెంటెడ్..

మలయాళంలో సీనియర్‌ దర్శకుడైన షాజీ కైలాస్‌ ‘పింక్‌ పోలీస్‌’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది. ఇప్పటికే సమంత ఈ కథ విని ఓకే చెప్పినట్టు...................

Samantha : సమంత మలయాళంలో ఎంట్రీ.. అక్కడ కూడా లేడీ ఓరియెంటెడ్..

Samantha

Samantha :  చైతూతో విడాకుల అనంతరం సమంత కెరీర్ మీదే ఎక్కువ ఫోకస్ చేసింది. వరుస సినిమాలు, యాడ్స్, ఐటెం సాంగ్స్ ఇలా వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేసేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో మూడు సినిమాలు, తమిళ్ లో ఒక సినిమా, బాలీవుడ్ లో ఒక సినిమా, ఒక సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా చేస్తుంది. ఇలా చేతిలో దాదాపు అరడజను పైగా ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. మరో వైపు యాడ్స్ కూడా వరుసగా చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తుంది.

తాజాగా సమంత మరో ప్రాజెక్టు ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సౌత్ లో అన్ని భాషల్లో, బాలీవుడ్ లో సినిమాలు చేసిన సమంత, హాలీవుడ్ లో కూడా చేయడానికి రెడీ అయిపోయింది. అయితే సమంత చేసిన సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యాయి. కానీ సమంత మలయాళంలో ఇప్పటివరకు డైరెక్ట్ గా ఒక్క సినిమా కూడా చేయలేదు. తాజాగా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓ ప్రాజెక్టుని ఓకే చేసిందట సమంత.

Sara Alikhan : కలెక్షన్లన్నీ నిర్మాతలకే వెళ్తాయి.. మాకేం ఇవ్వరు.. బాలీవుడ్ హీరోయిన్ వ్యాఖ్యలు..

మలయాళంలో సీనియర్‌ దర్శకుడైన షాజీ కైలాస్‌ ‘పింక్‌ పోలీస్‌’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది. ఇప్పటికే సమంత ఈ కథ విని ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమంత ఖుషి, యశోద సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉంది. ఈ రెండూ అయిపోయాక మలయాళం సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. మొత్తానికి వరుస సినిమాలతో సమంత బిజీబిజీగా మారింది.