Samantha : సమంత హాలీవుడ్ సినిమా.. స్టోరీ ఇదేనా? టైటిల్ ఏంటో తెలుసా?

బాఫ్టా అవార్డు గ్రహీత డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో, గురు ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత సునీత తాటి నిర్మాణంలో సమంత మెయిన్ లీడ్ గా ఓ సినిమాను గతంలో ప్రకటించారు.

Samantha Hollywood Movie : సమంత ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన శాకుంతలం సినిమా పరాజయం పాలైంది. త్వరలో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో రాబోతుంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ సిరీస్ లో నటిస్తుంది. మరో బాలీవుడ్ సినిమా కూడా సమంత చేతిలో ఉన్నట్టు సమాచారం. ఇక సమంత చేతిలో ఓ హాలీవుడ్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.

బాఫ్టా అవార్డు గ్రహీత డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో, గురు ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత సునీత తాటి నిర్మాణంలో సమంత మెయిన్ లీడ్ గా ఓ సినిమాను గతంలో ప్రకటించారు. ఇండియన్ రైటర్ తిమేరి మురారి రాసిన అరేంజ్మెంట్స్ అఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా ఈ హాలీవుడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా కథ వైరల్ గా మారింది.

Director Teja : తేజ సినిమాల్లో హీరో హీరోయిన్స్ ని కొడతారు.. నిజమేనా? అభిరామ్ కి టార్చర్ చూపించారట?

భారతీయ మూలాలు ఉండి బ్రిటన్ లో స్థిరపడిన ఓ వ్యక్తి తన తండ్రిని వెతుక్కుంటూ ఇండియాలోని చెన్నైకి వస్తాడు. అక్కడ డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే సమంత పరిచయం అవ్వడంతో ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నను పట్టుకున్నారా? ఈ మధ్యలో వీరిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు ఏంటి అనేదే కథ. ఇందులో సమంత బై సెక్సువల్ వుమెన్ గా కూడా కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమా చెన్నై, బ్రిటన్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇండియన్ బ్రిటన్ యాక్టర్ వివేక్ కల్రా, సమంత మెయిన్ లీడ్స్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు చెన్నై స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఈ హాలీవుడ్ సినిమాతో సమంత ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు