ఇంట్లో వ్యవసాయం.. ఎందుకో కారణం చెప్పిన సమంత..

  • Published By: sekhar ,Published On : July 30, 2020 / 12:45 PM IST
ఇంట్లో వ్యవసాయం.. ఎందుకో కారణం చెప్పిన సమంత..

లాక్‌డౌన్ వ‌ల‌న సినిమా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన స్టార్స్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేయాలనుకుని చేయలేని పనులు, తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. కొందరు తమలోని కొత్త టాలెంట్‌ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుని ఆశ్చర్యపరిచారు.

తాజాగా ఈ లాక్‌డౌన్ సమయంలో తాను అర్బన్ వ్యవసాయం చేస్తున్నట్టు అందుకోసం తన ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చేసి ఆకుకూరలతో పాటు కాయగూరలు కూడా పండిస్తున్నట్టు తెలిపింది సమంత. ఈ లాక్‌డౌన్ సమయంలో తాను వ్యవసాయం చేయడానికిగల కారణాలను వీడియో ద్వారా తెలియచేసిందామె.

https://www.instagram.com/p/CCa_K1fhu-z/?utm_source=ig_web_copy_link

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. కొంద‌రు డ్యాన్స్, వంట‌, క‌విత్వం, ఇలా త‌మ‌లోని క్రియేటివిటీని చూపించారు. ఇవ‌న్నీ నేనే చేయ‌లేన‌ని నాకు తెలుసు. కానీ నేను చేస్తున్నది ప్రతి ఒక్కరూ చేయగలిగేది, ఇది చాలా సులభం. తోటపనిపై నేను చాలా పోస్ట్‌లు పెడుతున్నాను, కాని నేను ఈ ప్రయాణాన్ని ఎందుకు ప్రారంభించానో మీకు చెప్పాలనుకుంటున్నాను..

https://www.instagram.com/p/CBYEmUUhEzy/?utm_source=ig_web_copy_link

లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న అంద‌రికి షాక్ ఇచ్చింది. అలాగే ఈ టైం చాలా మందికి ఎప్పుడూ గుర్తుంటుంది. లాక్‌డౌన్ ప్ర‌క‌టించగానే చాలా మంది సూప‌ర్ మార్కెట్‌కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నారు. కాని అవి ఎన్నాళ్ళ వ‌ర‌కు అనేది మాత్రం చెప్ప‌లేం. అవి అయిపోయిన‌ప్పుడు ఏం చేస్తాం. భ‌యానక స‌మ‌యంలో బ‌య‌ట‌కి వెళ్ళాలంటేనే వ‌ణుకొస్తుంది.

https://www.instagram.com/p/CBStlaShsQx/?utm_source=ig_web_copy_link

ఆహారాన్ని మ‌నం ఎప్పుడు విలువైన‌దిగా భావించ‌లేదు. క‌రోనా మ‌న‌కి మంచి పాఠం నేర్పింది. అందుకే అర్భ‌న్ వ్య‌వ‌సాయం మొద‌లు పెట్టాను. ఇది సాధికారిక‌మైంది. ప‌రిస్థితులు అనుకూలంగా లేన‌ప్పుడు ఇంట్లోనే వ్య‌వ‌సాయం చేసుకోవ‌డం ఒక్క‌టే మార్గం.. అందురే నేను ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చుకుని ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాను అని సమంత తెలిపింది.

https://www.instagram.com/tv/CDOdrRmBzmQ/?utm_source=ig_web_copy_link