చై ‘క్వారంటీమ్’.. ఫోటో షేర్ చేసిన సమంత

కరోనా ఎఫెక్ట్ : హోమ్ క్వారంటైన్.. అక్కినేని నాగ చైతన్య ఫోటో షేర్ చేసిన సమంత..

  • Edited By: sekhar , March 26, 2020 / 12:27 PM IST
చై ‘క్వారంటీమ్’.. ఫోటో షేర్ చేసిన సమంత

కరోనా ఎఫెక్ట్ : హోమ్ క్వారంటైన్.. అక్కినేని నాగ చైతన్య ఫోటో షేర్ చేసిన సమంత..

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా సినీ పరిశ్రమ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరికి వారు తమకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా హీరోయిన్‌ సమంత కూడా భర్త, హీరో నాగచైతన్య తమ పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నేలపై పడుకుని ఉన్న చైతూపై  హాష్‌ (పెంపుడు కుక్క పేరు) విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఫోటోకు సమంత ‘క్వారంటీమ్‌’ అనే క్యాప్షన్‌ను జత చేయడం విశేషం. కాగా చై-సామ్‌లు తమపెంపుడు కుక్క హాష్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు.

ఇటీవల హాష్‌ మొదటి బర్త్‌డేను సెలబ్రెట్‌ చేసిందీ జంట.. హాష్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సమంత భావోద్యేగ పోస్టును షేర్‌ చేశారు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న సెలబ్రిటీలంతా కూడా ఇంట్లో తమ రోజు వారీ పనులను ఫోటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.
 

View this post on Instagram

#quaranteam

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on