Aha యాప్ కోసం యాంకర్ గా సమంత

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 05:10 PM IST
Aha యాప్ కోసం యాంకర్ గా సమంత

Samantha Akkineni turns Talk-show host on Aha : సమంత..స్టార్ హీరోయిన్ గా సౌత్ లో కంటిన్యూ అవుతోంది. సినిమాలకు ఈ మద్య గ్యాప్ ఇచ్చినా కడా శ్యామ్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయిన దగ్గరనుంచి సినిమాలు తగ్గించి పర్సనల్ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న సమంత.. లాక్ డౌన్ లో కంప్లీట్ గా ఇంటికే పరిమితం అయ్యింది. ఇప్పుడిప్పుడే యాడ్ షూట్స్, ఫోటో షూట్స్ కోసం బయటికొస్తోంది సమంత.



సమంత.. లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రోగ్రామ్ బిగ్ బాస్. బిగ్ బాస్ లో సమంత యాంకరింగ్ ప్రోమోతో ప్రోగ్రామ్ పై విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ వచ్చాయి. ఇక ప్రోగ్రామ్ లోచేసిన యాంకరింగ్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇప్పుడు ఆ యాంకరింగ్ టాలెంట్ ని కంటిన్యూ చెయ్యబోతోంది సమంత. లేటెస్ట్ గా అచ్చతెలుగు ఓటీటీ యాప్ ఆహా కోసం యాంకరింగ్ చెయ్యడానికి రెడీ అవుతోంది ఈ స్టార్ హీరోయిన్.



ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్ ఎరేంజ్ చేస్తోంది. వాటిలో భాగంగా సమంత తో టాక్ షో ప్లాన్ చేసింది. అన్ని రకాల ప్రేక్షకుల్ని అ నుంచి ఆహా అనిపించడానికి ఎంటర్ టైన్ మెంట్ తో అందరినీ ఎంగేజ్ చెయ్యడానికి త్వరలోనే ఆహా ఫ్లాట్ ఫామ్ ద్వారా స్మాల్ స్క్రీన్ మీదకి రాబోతోంది. దీనికి సంబందించి రిలీజ్ అయిన ప్రోమోతో ఈ సమంత టాక్ షో మీద ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే ఆహా అనిపించే సమంత ప్రోగ్రామ్ ఆహా లో ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.