Samantha : రాష్ట్రపతిని కలిసిన సమంత & సిటాడెల్ టీం.. ద్రౌపది ముర్ము ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసా?

తాజాగా సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం తాజాగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు.

Samantha : రాష్ట్రపతిని కలిసిన సమంత & సిటాడెల్ టీం.. ద్రౌపది ముర్ము ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసా?

Samantha and Citadel team met President of India Droupadi Murmu and discuss about movies

Droupadi Murmu : సమంత(Samantha) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్(Family Man) సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ & డీకే దర్శకత్వంలో సిటాడెల్(Citadel) సిరీస్ తెరకెక్కుతుండగా వరుణ్ ధావన్(Varun Dhawan), సమంత మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. హాలీవుడ్(Hollywood) లో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటించిన సిటాడెల్ కి ఇది ఇండియన్ వర్షన్ అని, ప్రీక్వెల్ అని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సిరిస్.

తాజాగా సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం తాజాగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు. సిటాడెల్ సిరీస్ గురించి, పలు సినిమాల గురించి మాట్లాడారు సిటాడెల్ యూనిట్. సిటాడెల్ టీం రాష్ట్రపతిని కలిసిన ఫోటోలు వరుణ్ ధావన్, రాజ్ & డీకే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత అభిమానులు, పలువురు నెటిజన్లు సమంతను, సిటాడెల్ టీంని అభినందిస్తున్నారు.

Siddharth : ఆవిడ కాళ్ళకి కిందపడి మరీ నమస్కారం చేసిన సిద్దార్థ్.. ఎవరు ఆమె?

రాష్ట్రపతితో సిటాడెల్ టీం దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. రాష్ట్రపతి మేడంతో చాలా మంచి సమయం గడిపాము. ఆమెను కలవడం గర్వంగా ఫీల్ అవుతున్నాము. చాలా గౌరవంగా, ప్రేమగా ఆమె మాతో మాట్లాడారు. రాష్ట్రపతి గారు ఎక్కువగా కామెడీ సినిమాలు చూస్తారని తెలిపారు. ఈసారి యాక్షన్ కూడా ట్రై చేయమని సిటాడెల్ చూడమని చెప్పాము అని తెలిపారు.

View this post on Instagram

A post shared by Raj & DK (@rajanddk)