Samantha : మొత్తానికి హాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసిన సమంత

సమంత తన మొదటి హాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో.........

10TV Telugu News

Samantha :  తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతున్న సమంత పెళ్లి చేసుకొని జోరు తగ్గించింది. పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా తక్కువ సినిమాలు చేసింది. ఇప్పుడు చైతన్యతో విడాకులు అవ్వడంతో మళ్ళీ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. తమిళ్ లో ఒక చిత్రం షూటింగ్ లో ఉంది. మరో రెండు తమిళ్, తెలుగు చిత్రాలకి సైన్ చేసింది సమంత. అంతే కాక ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయబోతుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో కూడా ఫేమ్ తెచ్చుకుంది. అందరి సౌత్ హీరోయిన్స్ లాగే సమంత కూడా బాలీవుడ్ కి చెక్కేస్తోంది అనుకున్నారు. కానీ సమంత బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Bigg Boss 5 : సిరి చెంప పగులకొట్టేవాడిని అంటూ జెస్సి సంచలన వ్యాఖ్యలు

మొన్నటి దాకా రూమర్స్ అనుకున్న వార్తలు కాస్తా ఇప్పుడు నిజం అవుతున్నాయి. సమంత తన మొదటి హాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. ఇండియన్‌ రైటర్‌ టైమెరి ఎన్. మురారి ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే నవల రాసింది. దీనిని బ్రిటిష్‌-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా పబ్లిక్ చేశారు. 2004లో విడుదలైన ఈ నవల అప్పట్లో అత్యధికంగా అమ్ముడైంది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు కూడా ఈ నవల ఎంపికైంది. వీటికి ఎంపికైన ఏకైక ఇండియన్ నవలగా ఈ పుస్తకం రికార్డ్ సృష్టించింది.

Bigg Boss 5 : పాన్ షాప్ పెట్టి సిరిని పెంచాను.. షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు: సిరి తల్లి

ఇప్పుడు ఈ నవలని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనిని ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని సమంతతో ‘ఓ బేబీ’ సినిమా చేసిన నిర్మాతలు గురు ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్నారు. వాళ్ళతో సమంతకి మంచి సంబంధాలు ఉండటంతో సమంతని ఇందులో మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. ఇవాళ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. సినిమా టైటిల్ కూడా ఆ బుక్ పేరుతోనే అనౌన్స్ చేశారు. తాజాగా డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో సమంత హగ్ చేసుకొని క్లోజ్ గా ఉన్న ఫోటోని కూడా విడుదల చేశారు. ఈ సినిమా గురించి తన సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి.. 2009లో ‘ఏ మాయ చేసావే’ సినిమాకి ఆడిషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పటి దాక ఆడిషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత హాలీవుడ్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేశారు. ఈ హాలీవుడ్ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినందుకు డైరెక్టర్ కి, నిర్మాతలకి థ్యాంక్స్ అని పోస్ట్ చేసారు సమంత.

Aryan Khan : ఇంకా తేరుకొని ఆర్యన్ ఖాన్… కౌన్సిలింగ్ ఇప్పించనున్న హృతిక్

ఈ సినిమా అన్నౌన్స్ తో సమంత రేంజ్ మారిపోయినట్టే అని అభిమానులు అంటున్నారు. హీరోయిన్స్ అంతా బాలీవుడ్ టార్గెట్ పెట్టుకుంటే సమంత ఏకంగా హాలీవుడ్ టార్గెట్ చేసింది. ఇప్పట్లో సమంత తన దూకుడు ని ఆపేలా లేదని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి విడాకుల తర్వాత సమంత కెరీర్ ని గట్టిగానే ప్లాన్ చేస్తుంది.