Evaru Meelo Koteeswarulu : తారక్ షో లో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి..

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తొలిసారి కెమెరా ముందుకు రాబోతుండడంతో ఈ ఎపిసోడ్ పైన హైప్ క్రియేట్ అయ్యింది..

Evaru Meelo Koteeswarulu : తారక్ షో లో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి..

Ntr Samantha

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంతతో కలిసి కనిపించబోతున్నారు. తారక్ కొత్త సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారా అనుకోండి. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి స్మాల్ స్క్రీన్ మీద సందడి చెయ్యబోతున్నారు.

Samantha : ప్రీతమ్, సమంతను ఏమని పిలుస్తాడో తెలుసా?..

తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో తో మరోసారి తెలుగు ప్రేక్షకులను, బుల్లితెర అభిమానులను తన స్టైల్లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ దసరా స్పెషల్‌గా టెలికాస్ట్ కానుంది.

Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?

ఇప్పుడు సౌత్ క్వీన్ సమంత, తారక్ షోకి రానుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సామ్ – ఎన్టీఆర్ కలిసి ‘బృందావనం’, ‘రభస’, ‘రామయ్య.. వస్తావయ్యా’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలు చేశారు. ప్రస్తుతం నాగ చైతన్యతో విడాకుల కారణంగా వార్తల్లో వినిపిస్తున్న సమంత.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కి రాబోతుంది అని తెలియడంతో ఈ ఎపిసోడ్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతోంది.

Radikaa Sarathkumar : రష్మికతో రాధిక సందడి.. వీడియో వైరల్..