Samantha : బైసెక్సువల్ లేడీగా సమంత.. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ..

సినిమా కోసం ఎలాంటి పాత్ర అయినా చేసే ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సమంత ఇవాళ అనౌన్స్ చేసిన హాలీవుడ్ సినిమాలో స్వంత డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న ఓ బైసెక్సువల్ లేడీగా.......

Samantha : బైసెక్సువల్ లేడీగా సమంత.. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ..

Saam

Samantha :  చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేస్తుంది. ప్రస్తుతం సమంత చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయబోతుంది. తాజాగా బాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసి అందని ఆశ్చర్యపరిచింది సామ్. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకత్వంలో, సమంతతో ‘ఓ బేబీ’ సినిమా చేసిన గురు ఫిలిమ్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Sitara Ghattamaneni : యాని మాస్టర్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీస్తున్న మహేష్ కూతురు.. ఈ ప్రాక్టీస్ దేనికోసమో?

అయితే సినిమా కోసం ఎలాంటి పాత్ర అయినా చేసే ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. అలాంటి ఆర్టిస్టుల్లో సమంత ముందువరుసలో ఉంటుంది. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అవుతుంది సమంత. తన కెరీర్ లో అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఎన్నో చేసింది. తాజాగా మరో ఛాలెంజింగ్ క్యారెక్టర్ తో మన ముందుకి రాబోతుంది.

Akhanda : బాలయ్యతో 9 రోజులు దుమ్ములో ఫైట్ చేశా.. విలన్ అంటే అంత ఈజీ కాదు : శ్రీకాంత్

సమంత ఇవాళ అనౌన్స్ చేసిన హాలీవుడ్ సినిమాలో ఓ బైసెక్సువల్ లేడీగా కనిపించనుంది. స్వంత డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతూ, పరిశోధనలు చేస్తున్న ఓ 27 ఏళ్ళ తమిళ బైసెక్సువల్ లేడీగా సమంత ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్యారెక్టర్ లో కామెడీ, సీరియస్, యాక్షన్ తో పాటు బై సెక్సువల్ అంశాలని కూడా చూపించేందుకు సిద్ధమైపోయింది సామ్. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అని సమంత మరోసారి నిరూపిస్తుంది ఈ సినిమాతో. ఈ హాలీవుడ్ సినిమా కోసం సమంత అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాదిలో మొదలు పెట్టనున్నారు.