Yashoda : ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్‌లో సమంత | Samantha as pregnant lady in Yashoda Movie

Yashoda : ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్‌లో సమంత

ఇక ఇప్పటి వరకు కమర్షియల్ రోల్స్, నార్మల్ రోల్స్ చేసిన సమంత ఇక నుంచి డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలని చూస్తుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కొత్తగా ట్రై చేసింది. ఇప్పుడు........

Yashoda :  ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్‌లో సమంత

Samantha :  సమంత చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సైన్ చేసింది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక తమిళ్ సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. త్వరలో బాలీవుడ్ సినిమాలకి కూడా ఓకే చెప్పబోతోంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది.

ఇక ఇప్పటి వరకు కమర్షియల్ రోల్స్, నార్మల్ రోల్స్ చేసిన సమంత ఇక నుంచి డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలని చూస్తుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కొత్తగా ట్రై చేసింది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ చేయబోతుంది. ఇప్పటికే ఓ సినిమాలో లెస్బియన్ క్యారెక్టర్ చేయబోతుంది అని తెలిసింది. తాజాగా మరో సినిమాలో ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో చేయబోతోందని తెలుస్తుంది.

Surya : మరో అరుదైన ఘనత సాధించిన ‘జై భీమ్’.. ఆస్కార్ ఛానల్లో ‘జై భీమ్’ ప్రస్తావన

హరి-హరీష్ అనే యువ దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘యశోద’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో సమంత ప్రగ్నెంట్ ఉమెన్ గా కనపడనుందని సమాచారం. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అనుకోని సమస్యలు ఎదురైతే ఒంటరిగా ఆమె వాటిని ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మరి ఈ పాత్రలో సమంత ఎలా చేస్తుందో చూడాలి.

×