Samantha : ఆలోచనా విధానంపైనే మన బలం ఆధారపడుతుంది.. సమంత బ్యాక్ టు ఫిట్నెస్ మోడ్..

తాజాగా సమంత తను జిమ్ లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోని షేర్ చేసి.. సాధ్యమైనంత కఠినమైన డైట్‌లో ఉండటం బలం అనుకుంటారు. కానీ బలం అనేది మనం తినేదాంట్లో కాదు......................

Samantha : ఆలోచనా విధానంపైనే మన బలం ఆధారపడుతుంది.. సమంత బ్యాక్ టు ఫిట్నెస్ మోడ్..

Samantha back to fitness Mode shares gym video

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాను అని తెలిపి గత కొన్ని నెలలుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటుందని అందరికి తెలిసిందే. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు అంతా కోరుకున్నారు. కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. ఇటీవల శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత కనపడి మాట్లాడింది. ప్రస్తుతం షూటింగ్స్ కి కూడా వెళ్తుంది సమంత.

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సిటాడెల్ సిరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా సమంతా ఈ షూట్ లో పాల్గొంటుంది. ఇలా మెల్లి మెల్లిగా బ్యాక్ టు వర్క్ లోకి వస్తుంది సమంత. దీంతో సమంత ఆరోగ్యం బాగయింది అని అంతా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొన్ని నెలలు సైలెంట్ అయిపోయిన సమంత ఇటీవల మళ్ళీ వరుసగా పోస్టులు పెడుతుంది.

Vasishta Simha-Haripriya : పిల్ల జమీందార్ హీరోయిన్‌తో ఏడడుగులు వేసిన KGF నటుడు..

తాజాగా సమంత తను జిమ్ లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోని షేర్ చేసి.. సాధ్యమైనంత కఠినమైన డైట్‌లో ఉండటం బలం అనుకుంటారు. కానీ బలం అనేది మనం తినేదాంట్లో కాదు, మన ఆలోచనల్లో ఉంటుంది. అది మీరు నాకు నేర్పారు. నా కష్ట సమయాల్లో నాన్ని మోటివేట్ చేశారు అంటూ ఓ మ్యూజిక్ బ్యాండ్ ని ట్యాగ్ చేసింది. చాలా రోజుల తర్వాత సమంత జిమ్ వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సమంత బ్యాక్ టు ఫిట్నెస్ మోడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో సమంత యాక్టివ్ గా పాల్గొనబోతుందని సమాచారం. దీంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.