Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం!

విడాకుల తర్వాత సామ్ మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను ఒకే చేసిన పనిలో పడిన సామ్.. మొన్నటి వరకు పెళ్లి తర్వాత మ్యారీడ్ లైఫ్ కోసం కొంతమేర ఆచితూచి..

Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం!

Samantha

Samantha: విడాకుల తర్వాత సామ్ మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను ఒకే చేసిన పనిలో పడిన సామ్.. మొన్నటి వరకు పెళ్లి తర్వాత మ్యారీడ్ లైఫ్ కోసం కొంతమేర ఆచితూచి ఎంచుకుంది. అయితే, ఇప్పుడు రూల్స్ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కథలను వింటుంది. అందుకే పుష్పలో ఐటెం పాటతో చిందేసేందుకు సిద్దమైనట్లుగా తెలిసింది. ఇక, బాలీవుడ్ లో ఫ్యామిలీ మాన్ 2 తర్వాత సామ్ కి అక్కడ భారీ ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోని సామ్ ఇప్పుడు హాలీవుడ్ లో ఒక సినిమాకి సైన్ చేసి మళ్ళీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.

Song Promotions: ఒక్కో పాట రిలీజ్.. ప్రమోషన్స్‌లో కొత్త టెక్నిక్!

బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర‍్మాణ సంస్థ యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ ఇప్పుడు సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు ముంబై టూ హైదరాబాద్ ప్రచారం జరిగిపోతుంది. అది కూడా ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సామ్‌కు ప్రపోజల్‌ పెట్టారట ఆ నిర్మాణ సంస్థవాళ‍్లు. దీనికోసం సమంతకు భారీగా రెమ్యునరేషన్‌ ముట్టజెప్పడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఒప్పందానికి సామ్‌ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు కూడా వినిపిస్తుండగా.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానునుందట.

Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!

ఇప్పటికే తెలుగులో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది సామ్‌.. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. ఇక తమిళంలో కూడా అంతే. అయితే.. తెలుగులో ఒకటీ రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నా.. సామ్ మాత్రం బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ చేయనున్నట్లుగా వినిపిస్తుంది. ఇప్పటికే హాలీవుడ్ సినిమాకి సైన్ చేసిన సామ్ బాలీవుడ్ సినిమాలపై కూడా అధికారిక ప్రకటన వచ్చేస్తే మకాం ముంబైకి మార్చడం ఖాయంగా కనిపిస్తుంది.