Samantha : నాగచైతన్యపై సమంత నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసిందా.. క్లారిటీ ఇచ్చిన సమంత

శాకుంతలం సినిమా పాన్ ఇండియా కావడంతో అన్ని భాషల్లో సమంత గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలని చెప్తుంది. ఈ ఇంటర్వ్యూలలో చాలా రోజుల తర్వాత విడాకుల తరవాత తన లైఫ్ గురించి మాట్లాడింది.

Samantha : నాగచైతన్యపై సమంత నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసిందా.. క్లారిటీ ఇచ్చిన సమంత

Naga Chaitanya and Samantha

Samantha :  చైతన్యతో(Naga Chaitanya) డైవర్స్(Divorce) తీసుకున్నాక సమంత కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో(Social Media) కూడా ఎలాంటి హడావిడి చేయలేదు. ఆ తర్వాత యశోద(Yashoda) సినిమాతో వచ్చి మళ్ళీ మాయోసైటిస్ సోకిందని ఇంకొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇటీవలే కంబ్యాక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ఓ పక్క సినిమా షూటింగ్స్ తో, మరో పక్క శాకుంతలం(shakunthalam) ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

శాకుంతలం సినిమా పాన్ ఇండియా కావడంతో అన్ని భాషల్లో సమంత గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలని చెప్తుంది. ఈ ఇంటర్వ్యూలలో చాలా రోజుల తర్వాత విడాకుల తరవాత తన లైఫ్ గురించి మాట్లాడింది. అయితే ఎక్కడా కూడా నాగచైతన్య గురించి కానీ, విడాకుల ఇష్యూ గురించి కానీ మాట్లాడలేదు సమంత. సమంత విడాకుల తర్వాత లైఫ్ గురించి మాట్లాడగా ఆ మాటలని తీసుకొని కొంతమంది మరింత జోడించి ప్రమోట్ చేస్తున్నారు.

Naga Chaitanya samantha

ఈ నేపథ్యంలో ఓ తెలుగు సైట్.. ఎవరితో ఎవరు రిలేషన్ లో ఉన్నా, తిరిగినా నాకు సంబంధం లేదు. ప్రేమకి విలువ ఇవ్వనివాళ్ళు ఎవరితో ఉన్నా, ఎంతమందితో ఉన్నా నేను పట్టించుకోను. ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉండాలి అని సమంత అన్నట్టు రాశారు. ఈ వ్యాఖ్యలు నాగచైతన్యని ఉద్దేశించి అన్నట్టు రాశారు. దీంతో ఈ వార్త సమంత వరకు వెళ్లడంతో దీనిని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. నేను ఇలా ఎప్పుడూ చెప్పలేదు అని వాళ్ళకి కౌంటర్ ఇచ్చి, జనాలకు క్లారిటీ ఇచ్చింది.

Rashmika Mandanna : సమంత సినిమా రష్మికకు వచ్చిందా? రెయిన్‌బో నిర్మాత ఏమన్నాడు?

సమంత, చైతన్య విడాకులు తీసుకొని నెలలు గడుస్తున్నా ఇద్దరిపై వార్తలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇద్దరిపై నెగిటివ్ గా వార్తలు వస్తున్నా నాగ చైతన్య మాత్రం అసలు స్పందించట్లేదు. సమంత మాత్రం అప్పుడప్పుడు ఇలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఈ విషయంలో సమంత సీరియస్ గా ఇలా రియాక్ట్ అవ్వడంతో సామ్ ఫ్యాన్స్ అంతా ఆ సైట్ ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.