Samantha : అఖిల్ పోస్ట్‌కి సమంత కామెంట్.. అక్కినేని కుటుంబంతో వీడని బంధం!

టాలీవుడ్ లో లవ్లీ కపుల్ అనిపించుకున్న జంట అక్కినేని నాగచైతన్య-సమంత. కానీ అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. అభిమానులు మాత్రం వీరిద్దరూ మళ్ళీ కలిసిపోతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. కాగా విడిపోయిన తరువాత కూడా ఇటీవల కాలంలో సమంత, అక్కినేని కుటుంబంతో మెయిన్‌టైన్ చేస్తున్న రిలేషన్‌షిప్..

Samantha : అఖిల్ పోస్ట్‌కి సమంత కామెంట్.. అక్కినేని కుటుంబంతో వీడని బంధం!

akkineni akhil samantha

Samantha : టాలీవుడ్ లో లవ్లీ కపుల్ అనిపించుకున్న జంట అక్కినేని నాగచైతన్య-సమంత. కానీ అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణం ఇప్పటి వరకు తెలియదు. అభిమానులు మాత్రం వీరిద్దరూ మళ్ళీ కలిసిపోతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. కాగా విడిపోయిన తరువాత కూడా ఇటీవల కాలంలో సమంత, అక్కినేని కుటుంబంతో మెయిన్‌టైన్ చేస్తున్న రిలేషన్‌షిప్.. అక్కినేని అభిమానుల్లో ఆశలు చిగిరించేలా చేస్తుంది. సమంత సినిమాలకు అక్కినేని హీరోలు, అక్కినేని హీరోల సినిమాలకు సమంత రియాక్ట్ అవ్వడం అందర్నీ ఆకట్టుకుంటుంది.

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ వచ్చేది ఏకంగా అప్పుడేనా..?

అక్కినేని యువహీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పవర్ ఫుల్ వీడియోని ఈ ఫిబ్రవరి 4న రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోని అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, దానిపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత కూడా స్పందించింది. ‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ హైలైట్ గా మారింది. గతంలో అఖిల్ పుట్టినరోజు నాడు కూడా సమంత అఖిల్ కి ఇన్‌స్టాగ్రామ్ లో విష్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే అక్కినేని హీరోలు కూడా సమంత పోస్ట్ లకు స్పందిస్తున్నారు. సమంత ఆరోగ్యం సమస్యని అనౌన్స్ చేసిన సమయంలో అఖిల్.. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ కామెంట్ చేసి ధైర్యం చెప్పాడు. ఇక మరో అక్కినేని హీరో సుశాంత్.. సమంత శాకుంతలం టీంకి అభినందనలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. ఇవన్నీ చూస్తుంటే విడాకులు తరువాత కూడా అక్కినేని కుటుంబంతో సమంత రిలేషన్ బాగానే ఉంది అని అర్ధమవుతుంది. కాగా అఖిల్ బీస్ట్ సినిమాని వేసవి సమయంలో ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)