Samantha : రెండేళ్లలో చాలా జరిగాయి.. జీవిత పాఠాలు నేర్చుకున్నాను..

శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది.

Samantha : రెండేళ్లలో చాలా జరిగాయి.. జీవిత పాఠాలు నేర్చుకున్నాను..

Samantha comments on her life from past 2 years

Samantha :  సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ఫుల్ జోష్ తో కంబ్యాక్ ఇచ్చింది. ఓ పక్క ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. దీంతో సమంత, చిత్రయూనిట్ ఇండియా అంతటా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

సమంత ఇంత యాక్టీవ్ గా ప్రమోషన్స్ చేస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తూ సమంత ఈజ్ బ్యాక్ అంటున్నారు. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మరో అయిదు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఈ రెండేళ్ల జర్నీని ఎలా భావిస్తున్నారు అని అడగగా, సమంత.. ఈ రెండేళ్లలో నా లైఫ్ లో చాలా జరిగాయి. జీవిత పాఠాలు నేర్చుకున్నాను ఈ సమయంలో. ఇప్పుడు దేనికైనా సిద్దపడి ఉన్నాను అని అనుకుంటున్నాను అంటూ రిప్లై ఇవ్వడంతో సమంత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Paruchuri Gopala Krishna : ఇలాంటి పాయింట్ పై సినిమా తీస్తే చూస్తారా అనే భయం ఉంటుంది.. బలగంపై పరుచూరి వ్యాఖ్యలు

అలాగే మరో నెటిజన్ ఇటీవల మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్తున్నారు అనుకుంట అని అడగగా సమంత.. మూడు భాషల్లో శాకుంతలం సినిమాకు కూడా నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. కష్టమే అనిపించింది. అయినా ఇది అవసరం. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగించాలనుకుంటున్నాను, నేనే నా సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటాను అని తెలిపింది. ఇలా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది సమంత.