Samantha : పెళ్లిళ్లు చెడిపోవడానికి నువ్వే కారణం

లీవుడ్ లో ఫేమస్ షో కాఫీ విత్ కరణ్. ఈ షో ఏడో సీజన్ జులై 7 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సారి సౌత్ సెలబ్రిటీలని కూడా ఈ షోకి తీసుకొచ్చారు. ఈ ప్రోమోలో సమంత అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి........

Samantha : పెళ్లిళ్లు చెడిపోవడానికి నువ్వే కారణం

Samantha

Koffee With Karan :  సమంత, చైతూ విడిపోయిన తర్వాత అభిమానులు, నెటిజన్లు, ప్రేక్షకులు వాళ్ళిద్దరిపై మరింత ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్టులు పెట్టినా వైరల్ చేస్తున్నారు. ఇక పెళ్లి, ప్రేమ గురించి మాట్లాడితే మరింత వైరల్ చేసేస్తున్నారు. తాజాగా సమంత పెళ్లిళ్లపై మాట్లాడింది.

బాలీవుడ్ లో ఫేమస్ షో కాఫీ విత్ కరణ్. ఈ షో ఏడో సీజన్ జులై 7 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సారి సౌత్ సెలబ్రిటీలని కూడా ఈ షోకి తీసుకొచ్చారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ అవ్వగా తాజగా ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, అనిల్‌కపూర్‌, వరుణ్‌ ధావన్‌, విజయ్‌ దేవరకొండ, అనన్యాపాండే, జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌, అక్షయ్‌కుమార్‌, సమంత… ఇలా పలువురు వచ్చారు. అయితే ఈ ప్రోమోలో సమంత అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Ritesh Rana : హ్యాపీ బర్త్‌డే.. కొత్త మల్టీవర్స్.. ఆర్టిస్టులకంటే గన్స్‌కే ఎక్కువ బడ్జెట్ అయింది..

సమంత కరణ్ జోహార్ ని ఉద్దేశించి.. ఎంతోమంది పెళ్లిళ్లు చెడిపోవడానికి, వివాహబంధాలు సరిగా ఉండకపోవడానికి నువ్వే కారణం అని అంది. దానికి కరణ్.. నేనేం చేశాను అని అడగగా సమంత.. పెళ్లి చేసుకుంటే లైఫ్ ‘కబీ ఖుషి కబీ ఘమ్‌’(K3G) సినిమాలా ఉంటుందని మీరు స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజజీవితంలో మాత్రం అది KGF సినిమాలా ఉంది. అని చెప్పింది. దీంతో కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇండైరెక్ట్ గా తన వివాహ బంధం బాగోలేదని సమంత చెప్తుంది. ప్రోమోలోనే పెళ్లి గురించి ఈ రేంజ్ లో చెప్పింది అంటే ఫుల్ ఎపిసోడ్ లో మరెన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చెప్తుందో అని సమంత అభిమానులతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా సమంత ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారుతుంది అని అంటున్నారు.