Samantha : ‘శాకుంతలం’లో చాలా కష్టంగా అనిపించింది..

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శాకుంతలం సినిమా సమయంలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఓ భంగిమలో సమంత నిల్చున్న ఓ ఫోటోని షేర్ చేసి.. శాకుంతలం సినిమా చేసేటప్పుడు ఎప్పుడూ............

Samantha : ‘శాకుంతలం’లో చాలా కష్టంగా అనిపించింది..

Samantha comments on shakunthalam movie

Samantha :  సమంత ఇటీవల యశోద సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. ఆ సినిమా సమయంలో తనకి మయోసైటిస్ సోకిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సామ్. దీంతో అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే కొన్ని రోజుల క్రితమే శాకుంతలం డబ్బింగ్ మొదలుపెట్టినట్టు ఓ పోస్ట్ పెట్టింది. చాలా నెలలుగా అసలు బయట కనిపించకుండా రెండు రోజుల క్రితమే ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇక శాకుంతలం ట్రైలర్ ని జనవరి 9న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టు, అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని PVR RK సినీప్లెక్స్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. తాజాగా సమంత శాకుంతలం గురించి మరో పోస్ట్ పెట్టింది.

Director Bobby : ప్రేక్షకులు అలా మారిపోయారు.. వాళ్ళు మనకి రెండు గంటలు ఇవ్వడమే కష్టం..

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శాకుంతలం సినిమా సమయంలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఓ భంగిమలో సమంత నిల్చున్న ఓ ఫోటోని షేర్ చేసి.. శాకుంతలం సినిమా చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే ఎక్స్‌ప్రెషన్‌ పెట్టాల్సి వచ్చేది. నడుస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఏడుస్తున్నప్పుడు.. ఇలా ఎప్పుడూ ముఖంలో, బాడీలో ఒకే ఎక్స్‌ప్రెషన్‌ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. చాలా కష్టంగా అనిపించేది. నా వల్ల కాలేదు. శిక్షణకి నా కుక్కని కూడా తీసుకెళ్ళాను. అది కూడా ఫోజులు పెడుతుంది అంటూ తన కుక్క ఫొటోలని కూడా షేర్ చేసింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ తో మళ్ళీ సమంత బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.