Yashoda : నాగచైతన్య, అఖిల్‌కి పోటీగా సమంత.. రివేంజ్ అంటున్న నెటిజన్లు..

సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న ‘యశోద’ సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కి అనౌన్స్ చేయడం....

Yashoda : నాగచైతన్య, అఖిల్‌కి పోటీగా సమంత.. రివేంజ్ అంటున్న నెటిజన్లు..

Chay Sam

 

Samantha :  చైతూతో విడాకుల తర్వాత సమంత వచ్చిన సినిమాలన్నిటిని ఒప్పుకుంటుంది. నార్మల్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఓకే చేస్తూ షూటింగ్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలో పాన్ ఇండియా సినిమా ‘యశోద’ ఒకటి. హరి-హరీష్ అనే యువ దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ‘యశోద’ తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న ‘యశోద’ సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కి అనౌన్స్ చేయడం ప్రాబ్లంగా మారింది. నెటిజన్లు, మీమర్స్ ఈ డేట్ గురించి మరో రెండు సినిమాలని కంపేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం నాగ చైతన్య, అఖిల్ సినిమాలు కూడా అప్పుడే ఉండటం.

Yashoda : విడాకుల తర్వాత సమంత హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య మొదటి సారి చేసిన బాలీవుడ్ సినిమా, అమీర్ ఖాన్ తో కలిసి నటించిన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ 11 ఆగస్టు 2022న విడుదల చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇక అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘ఏజెంట్’ సినిమా 12 ఆగస్టు 2022న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. దీంతో సమంత కూడా తన ‘యశోద’ సినిమాని అదే డేట్ కి ప్రకటించడంతో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సమంత సినిమా డేట్ విడుదల చేయడంతో నాగ చైతన్య, అఖిల్ కి పోటిగానే ఈ డేట్ ని అనౌన్స్ చేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో ఆ టైంకి ఏదైనా వాయిదా పడుతుందా లేక మూడు పోటీ పడతాయా, ఒకవేళ మూడు పోటీ పడితే ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి అంటే 12 ఆగస్టు 2022 వరకు వేచి చూడాల్సిందే.