Samantha : సమంత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారించనున్న కోర్టు…

సమంత తన విడాకులపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటీషన్ వేసింది. ఆ వీడియోలలో మాట్లాడిన డాక్టర్ వెంకట్రావుతో పాటు

Samantha : సమంత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారించనున్న కోర్టు…

Samantha

Samantha :  సమంత చైతన్య విడాకుల అనంతరం సోషల్ మీడియాలో సమంత పై భారీగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ కి సమంత ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సమంత విడాకుల మీద లేనిపోనివి కల్పించి అసత్యాలతో, తప్పుడు థంబ్ నైల్స్ తో ప్రచారం చేశారు. ఇవి సమంత దృష్టి వరకు వెళ్లాయి. దీంతో వీటిపై సమంత సీరియస్ అవ్వడమే కాకుండా కోర్టులో పరువు నష్టం దావా కేసు కూడా వేసింది.

Samantha : సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సమంత

సమంత తన విడాకులపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటీషన్ వేసింది. ఆ వీడియోలలో మాట్లాడిన డాక్టర్ వెంకట్రావుతో పాటు తెలుగు పాపులర్ టీవీ, సుమన్ టీవీ, మరో యూట్యూబ్ ఛానల్ పై దావా వేసింది సమంత. సమంత చైతన్య విడిపోయిన తర్వాత సమంతపై ఆరోపణలు చేస్తూ డాక్టర్ వెంకట్ రావు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో తన పరువుకి నష్టం కలిగించేలా డాక్టర్ వెంకట్ రావు ఇంటర్వ్యూ ఇవ్వడంపై సమంత అభ్యoతరం వ్యక్తం చేస్తూ, తనకు లేనిపోని ఎఫైర్లు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేసిన వెంకట్ రావుపై, ఆ ఛానల్స్ పై కేసు వేసింది సమంత.

SaiDharam Tej : చేతిలోనే చెయ్యేసి.. సాయి ధరమ్ తేజ్ తో హరీష్ శంకర్

వెంటనే యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా నుండి ఆ వీడియోలకు సంబంధించిన అన్ని లింకులని డిలీట్ చేయించాలని పిటిషన్ లో సమంత పేర్కొంది. ఇకపై తన విడాకుల గురించి, తన గురించి అసత్య ప్రసారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరింది సమంత. ఈ కేసు ఇవాళ విచారణకి రానుంది. మరి ఆ ఛానల్స్ వాళ్ళు విచారణకి వస్తారా? సమంతనే డైరెక్ట్ గా విచారణకి వస్తుందా లేక సమంత తరపున తన న్యాయవాది వాదనలు వినిపిస్తాడా చూడాలి.