పెళ్లి తర్వాత కూడా స్యామ్ కి క్రేజ్ తగ్గలేదు!

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 04:53 AM IST
పెళ్లి తర్వాత కూడా స్యామ్ కి క్రేజ్ తగ్గలేదు!

ప్రస్తుతం టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంతా. ఏమాయ చేసిందో కానీ ఏ క్యారెక్టర్ చేసినా ఆ హీరోయిన్ ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా మజిలీ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.  పెళ్లైనా సరే అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ దూసుకుపోతూనే ఉంది. మజిలీలో సమంతా చేసిన శ్రావణి క్యారెక్టర్ భర్తని ప్రాణంగా ప్రేమించే ప్రతి భార్యని కంటతడిపెట్టించింది. ఈ మూవీలో సమంతా ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టేసింది. అంతేకాదు ప్లాపులతో డీలాపడిపోయిన భర్త నాగచైతన్యకి హిట్టిచ్చి గాడిలోపెట్టింది.
 
ఫిల్మ్ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్స్ కి పెళ్లైపోతే ఆ తర్వాత క్రేజ్ అమాంతం పడిపోతుంది. అక్కా, చెల్లి, వదిన క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే. కానీ సమంత విషయంలో మాత్రం అలా జరగలేదు. పెళ్లికాక ముందుకంటే సమంతా క్రేజ్ ఇప్పుడే ఇంకాస్త పెరిగింది. 2017లో వచ్చిన మెర్సెల్ సినిమా తర్వాత ఇప్పటిదాకా సమంతాకి ఒక్క ప్లాప్ కూడా పడలేదు. రంగస్థలం, మహానటి, తమిళ్ లో ఇరుంబుతురై, సీమరాజ, యూటర్న్ ఇలా అన్నీ హిట్సే.
 
రకుల్, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్స్ ఇంకా పెళ్లి చేసుకోకుండా గ్లామర్ షో చేస్తున్నా అవకాశాలు రావడం లేదు. సమంతా మాత్రం ఇటు తెలుగు అటు తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తాచాటుతోంది. స్యామ్ ప్రస్తుతం తెలుగులో నందినీ రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న ఓ బేబి, రాహుల్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న మన్మధుడు 2, 96 రీమేక్ లో నటిస్తోంది. తమిళ్ లో సమంతా నటించిన సూపర్ డీలక్స్ మూవీ ఈ ఏడాది మార్చిలో రిలీజై హిట్టు టాక్ ని సంపాదించుకుంది.