Samantha : నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా.. సమంత షాకింగ్ రియాక్షన్..

సమంతపై తనకున్న అభిమానాన్ని టాటూ ద్వారా వ్యక్త పరిచాడు సామ్ వీరాభిమాని పవన్ సమ్ము..

Samantha : నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా.. సమంత షాకింగ్ రియాక్షన్..

Sam Fan

Samantha: సినిమా హీరో హీరోయిన్లకి ఎలాంటి ఫ్యాన్స్ ఉంటారో.. ఒకోసారి వాళ్లు చూపించే అభిమానాకి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతుంటారు. సినిమా రిలీజ్‌లప్పుడు బ్యానర్స్, ఫ్లెక్సీలు కట్టడం దగ్గరినుంచి పుట్టినరోజులకు పలు సేవా కార్యక్రమాలు చెయ్యడం వంటి సంఘటనలు చాలా చూశాం.

Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..

ఇక ఫ్యాన్స్ తమ ఫేవరెట్ యాక్టర్స్ టాటూలు వేయించుకోవడం అనేది తెలిసిందే. అయితే రీసెంట్‌గా పవన్ అనే సమంత అభిమాని టాటూతో పాటు అతను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎంతలా అంటే ఏకంగా సమంతనే అతని ట్వీట్‌ను రీ ట్వీట్ చేసేంత.

Sam Fan Tattoo

పవన్ అనే కుర్రాడు సామ్‌కి వీరాభిమాని. తన చేతి మీద సమంత పేరుని ‘సమ్ము’ అని టాటూ వేయించుకున్నాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నువ్వే సమ్ము.. నీపై ఉన్న ప్రేమ అనంతమైనది.. నా ప్రేమతో శాశ్వతం.. ఈ టాటూ కూడా శాశ్వతం’ అంటూ సమంతను ట్యాగ్ చేశాడు. ఫ్యాన్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ షాకింగ్ ఎమోజీలను యాడ్ చేసింది. అభిమాని ట్వీట్‌ను సామ్ రీ ట్వీట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.