Samantha : 12 ఏళ్ళ తర్వాత ఆడిషన్ ఇచ్చిన సమంత.. అప్పుడు టాలీవుడ్.. ఇప్పుడు హాలీవుడ్..

ఈ సినిమా గురించి తన సోషల్ మీడియాలో సినిమా టైటిల్ పోస్టర్, డైరెక్టర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ... 2009లో 'ఏ మాయ చేసావే' సినిమాకి ఆడిషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పటి దాక.......

10TV Telugu News

Samantha :  చైతన్యతో విడాకుల తర్వాత మంచి ఫామ్ లో ఉంది సమంత. వరుస ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. తమిళ్ లో ఒక చిత్రం షూటింగ్ లో ఉంది. మరో రెండు తమిళ్, తెలుగు చిత్రాలకి సైన్ చేసింది సమంత. అంతే కాక ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయబోతుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో కూడా ఫేమ్ తెచ్చుకోవడంతో అందరి సౌత్ హీరోయిన్స్ లాగే సమంత కూడా బాలీవుడ్ కి చెక్కేస్తోంది అనుకున్నారు. కానీ సమంత బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ లో సినిమా ప్లాన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Samantha : మొత్తానికి హాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసిన సమంత

‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకత్వంలో, సమంతతో ‘ఓ బేబీ’ సినిమా చేసిన నిర్మాతలు గురు ఫిలిమ్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Bigg Boss 5 : పాన్ షాప్ పెట్టి సిరిని పెంచాను.. షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు: సిరి తల్లి

ఈ సినిమా గురించి తన సోషల్ మీడియాలో సినిమా టైటిల్ పోస్టర్, డైరెక్టర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ… 2009లో ‘ఏ మాయ చేసావే’ సినిమాకి ఆడిషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పటి దాక ఆడిషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత హాలీవుడ్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. నా ఫేవరేట్ సిరీస్ ‘డౌన్ టౌన్ ఆబ్బె’ డైరెక్టర్ ఫిలిప్ జాన్ కి ఆడిషన్ ఇచ్చాను. ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. ఈ హాలీవుడ్ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినందుకు డైరెక్టర్ కి, నిర్మాతలకి థ్యాంక్స్ అని తెలుపుతూ ఈ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసింది సమంత.

Bigg Boss 5 : సిరి చెంప పగులకొట్టేవాడిని అంటూ జెస్సి సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమాతో సమంత హాలీవుడ్ రేంజ్ కి మారిపోయినట్టే అని అభిమానులు అంటున్నారు. మొత్తానికి విడాకుల తర్వాత సమంత కెరీర్ ని గట్టిగానే ప్లాన్ చేసి ఇప్పట్లో ఈ దూకుడుని ఆపేలా లేదని సినీ వర్గాల సమాచారం.