Samantha : కొత్తదనం కోసం ఆ పాత్ర చేశాను.. నార్త్‌కి, సౌత్‌కి తేడా లేదు : సమంత

గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ) వేడుకలకి సమంత హాజరైంది. ఈ వేడుకల్లో 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ కి కాను సమంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫీమేల్

Samantha : కొత్తదనం కోసం ఆ పాత్ర చేశాను.. నార్త్‌కి, సౌత్‌కి తేడా లేదు : సమంత

Sam Iffi

Samantha :  సమంత విడాకుల తర్వాత సినిమాలతో, స్నేహితులతో బిజీగా మారిపోయింది. సినిమా షూటింగ్ లేకపోతే విహారయాత్రలు చేస్తూ, పార్టీలు చేసుకుంటూ గడిపేస్తుంది. తాజాగా గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ) వేడుకలకి సమంత హాజరైంది. ఈ వేడుకల్లో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ కి కాను సమంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఇఫీ వేదికపై సమంత మాట్లాడింది.

Allu Arha : బుర్జ్‌ఖలీఫాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని కొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్హ

52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సమంత మాట్లాడుతూ… ఏ నటి, నటుడైనా ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయాలని, అవే రకమైన భావోద్వేగాలను చూపించాలని అనుకోరు. సవాలు నిండిన కొత్త పాత్రలు, కథా నేపథ్య వాతావరణం కోసం చూస్తారు. ‘ఫ్యామిలీమ్యాన్‌–2’ సిరీస్‌ రూపకర్తలు రాజ్, డీకే నన్ను వ్యక్తిగతంగా కలవకుండానే, అందులోని యాక్షన్‌ పాత్రకు నన్ను ఎంచుకున్నారు. తీరా నన్ను కలిశాక, వారికి తమ తప్పు దిద్దుకొనే టైమ్‌ దాటిపోయింది. కొత్తదనం కోసం తపిస్తున్న నేనూ ఆ పాత్రకు వెంటనే ఓకే చెప్పేశాను అని నవ్వుతూ అన్నారు సమంత.

Jai Bhim : క్షమాపణలు చెప్పిన ‘జై భీమ్’ డైరెక్టర్

తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ నా పుట్టినిల్లు. నటిగా నేను ఇక్కడ ఉన్నానంటే అవే కారణం. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికి పెద్ద తేడా ఏమీ లేదు అని అన్నారు. సినిమా, ఓటీటీ దేనికదే. చీకటి హాలులో అంతరాయాలకు దూరంగా చూసే సినిమాతో పోలిస్తే, ఇంట్లో టీవీలో అనేక అంతరాయాల మధ్య చూసే ఓటీటీ వెబ్‌ సిరీసుల్లో ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టి, మెప్పించడం చాలా కష్టం. రొటీన్‌కు భిన్నమైన భావోద్వేగాలనూ, పాత్రలనూ పండించేందుకు నటీనటులకు కూడా ఓటీటీ ఓ అవకాశం లాంటిది. అందుకే ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’లోని ఈ పాత్రని చేశాను అంది.
NTR : ఈఫిల్ టవర్ వద్ద తనయుడికి ముద్దు పెడుతున్న ఎన్టీఆర్

ఈ సిరీస్ లో మీరు చేసిన యాక్షన్ పాత్రని చూసి మీకు ‘ధూమ్‌’ సిరీస్‌ లాంటి సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో అని అనగా సమంత దానికి.. నేనిక యాక్షన్‌ స్టార్‌ అయిపోతాను అన్నమాట అంటూ నవ్వేసింది.