Samantha: స్టైలిస్ట్ కోసం టవల్ చుట్టుకొచ్చిన సమంత

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత, తన స్పీడును....

Samantha: స్టైలిస్ట్ కోసం టవల్ చుట్టుకొచ్చిన సమంత

Samantha In Towel Picture Goes Viral

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత, తన స్పీడును అమాంతం పెంచేసింది. దీంతో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వాటిని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా మలిచేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇటీవల తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి సమంత నటించిన ‘కాత్తువాకుల రెండు కాదల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యింది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్న సమంత, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.

Samantha : సోకుల అజంతా.. సమంత | ‘పీకాక్‌’పై పిచ్చెక్కించే స్టిల్స్

ఒంటిపై కేవలం ఒక తెల్లటి టవల్‌తో దర్శనమిచ్చింది సమంత. ఈ ఫోటోను ఒకటికి రెండుసార్లు చూస్తున్నారు అభిమానులు. వైట్ టవల్ చుట్టుకుని అద్దం ఎదురుగా నిల్చున్న సమంత, తన మొహం కనిపించకుండా జాగ్రత్త పడింది. అయితే తన స్టైలిస్ట్ మరియు ఫ్రెండ్ అయిన నీరజ కోన రాసిన ఓ నోట్ చూపిస్తూ, దానికి తనదైన స్టయిల్‌లో రిప్లై ఇచ్చింది సమంత. ‘‘ పాప.. లవ్ యూ.. నువ్వు ఒక అద్భుతం.. ఇది గుర్తుపెట్టుకో’’ అంటూ సమంతకు నీరజ కోన రాసిన నోట్‌కు.. ‘‘ అ… నేను నిన్ను ఆల్రెడీ మిస్ అవుతున్నాను.. త్వరగా తిరిగి రా.. ఈ క్యూట్ నోట్‌కు థ్యాంక్స్’’ అంటూ కామెంట్ చేసింది.

Samantha : మొన్న సమంత కోసం విజయ్.. ఇవాళ విజయ్ కోసం సమంత.. స్పెషల్ సెలబ్రేషన్స్..

ఇలా మిర్రర్ సెల్ఫీలో టవల్‌తో దర్శనమిచ్చిన సమంత, తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందని వారు అంటున్నారు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేయగా, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ‌తో దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో సమంత ఓ కశ్మీరి అమ్మాయిగా కనిపించనుంది.

Samantha In Towel Picture Goes Viral