Samantha : సమంత కేవలం దానివల్లే నెలకు మూడు కొట్లు సంపాదిస్తుంది..

 చైతూతో విడాకుల అనంతరం సమంత కెరీర్ మీద, డబ్బు మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటుంది. ఇప్పటికే అన్ని..................

Samantha : సమంత కేవలం దానివల్లే నెలకు మూడు కొట్లు సంపాదిస్తుంది..

Samantha

Samantha :  చైతూతో విడాకుల అనంతరం సమంత కెరీర్ మీద, డబ్బు మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు చేతిలో ఉన్నాయి. ఇక డబ్బుల కోసం వరుసగా యాడ్స్ చేస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా ఒప్పేసుకుంటుంది. యాడ్స్ లో కూడా మరింత రెచ్చిపోయి బికినీలు వేసి మరీ చేస్తుంది.

ఇలా యాడ్స్, సినిమాలతో బాగానే డబ్బులు సంపాదిస్తూ మరోవైపు పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెడుతుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో కూడా ప్రకటనల జోరు పెంచింది. సోషల్ మీడియా నుంచి కూడా బాగానే సంపాదిస్తుంది సమంత. సాధారణంగా సోషల్‌మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ గురించి పోస్ట్ చేయాలి అంటే కచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. సెలబ్రిటీలకు సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు కూడా తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో చెల్లిస్తారు.

Rana Daggubati : అలా అనే వాళ్ళ కోసమే ఈ సినిమా చేశాను..

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఇలాంటి ప్రమోషన్స్ చేస్త్తారు. సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ప్రోడక్ట్స్ గురించి ప్రమోషన్ చేస్తూ దాదాపు నెలకు మూడు కోట్ల వరకు సంపాదిస్తుందని సమాచారం. సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రీచ్ కూడా బాగానే ఉండటంతో పలు కంపెనీలు సమంతతో డీల్ మాట్లాడుకుంటున్నాయి. ఇలా సోషల్ మీడియా ద్వారే నెలకి దాదాపు మూడు కోట్లు సంపాదిస్తుంది. మొత్తానికి అన్ని రకాలుగా సమంత బాగానే సంపాదించాలని ఫిక్స్ అయింది.