Samantha : ఆ ఐటెం సాంగ్‌కి సమంతనే కరెక్ట్ : దేవిశ్రీ ప్రసాద్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కెరీర్‌లోనే తొలిసారి సమంత ప్రత్యేక గీతంలో నటించింది. ఈ పాటకు సమంతనే గుడ్‌ ఛాయిస్‌. ఈ పాటంతా రెడీ అయినా ఇందులో ఎవరు......

Samantha : ఆ ఐటెం సాంగ్‌కి సమంతనే కరెక్ట్ : దేవిశ్రీ ప్రసాద్

Devisri

 

Samantha :  ఇటీవల సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా ‘పుష్ప’. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ ఐటెం సాంగ్ దేశం మొత్తాన్ని ఊపేసింది. ఈ ఐటెం సాంగ్ లో సమంత తన డ్యాన్స్, పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. సమంత కెరీర్ లో ఇదే మొదటి ఐటెం సాంగ్ కావడంతో బాగా పాపులర్ అయింది.

గతంలోనే సుకుమార్, అల్లు అర్జున్ సమంతని అడిగి ఈ సాంగ్ కి ఒప్పించినట్లు తెలిపారు. వాళ్ళు అనుకున్నట్లే ఈ సాంగ్ తో పాటు సమంత సినిమాకి చాలా ప్లస్ అయింది. తాజాగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటలో సమంత చేయడంపై స్పందించారు.

Siri Hanumanthu : బిగ్‌బాస్ సిరికి కరోనా పాజిటివ్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ”కెరీర్‌లోనే తొలిసారి సమంత ప్రత్యేక గీతంలో నటించింది. ఈ పాటకు సమంతనే గుడ్‌ ఛాయిస్‌. ఈ పాటంతా రెడీ అయినా ఇందులో ఎవరు చేస్తున్నారు అని ఫైనల్‌ కాలేదు. సమంతను ఎంపిక చేయాలన్నది పూర్తిగా సుకుమార్‌, బన్నీల నిర్ణయమే. సామ్‌ ఈ సాంగ్ లో చేస్తుందని నాకు షూట్ కి రెండు రోజుల ముందే తెలుసు. నేను అప్పుడే అనుకున్నాను సమంతనే దీనికి కరెక్ట్ అని. జనాలు ప్రత్యేక గీతంలో ఒక కొత్త ఫేస్ ని చూస్తే ఇంకా బాగుంటుంది. సమంతకి ఇదే ఫస్ట్ ఐటెం సాంగ్ కాబట్టి మరింత క్లిక్ అయింది. అలాగే పాటలో సమంత మేకోవర్‌ కూడా చాలా బాగుంది. నా మ్యూజిక్‌లో తాను డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది. తన డ్యాన్స్, లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట కోసం తను చేసిన కృషికి అభినందిస్తున్నాను’’ అని తెలిపారు.