Naga Chaitanya-Samantha: చైతూ గుర్తులు చెరిపేస్తున్న సామ్.. ఫోటోలు డిలీట్!

టాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం ముగిసింది. తామిద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటించడంతో ఎవరికి వారు దీనికి కారణమేంటని..

10TV Telugu News

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం ముగిసింది. తామిద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటించడంతో ఎవరికి వారు దీనికి కారణమేంటని తెలుసుకొనేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారు. దీనికి తోడు సోషల్ మీడియా సాక్షిగా చై, సామ్ తో పాటు మరికొందరు చేసే ట్వీట్స్ మరింత రచ్చగా మారి చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానెళ్ల మీద సామ్ పరువు నష్టం కేసులు కూడా పెట్టింది.

Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

ఇక బంధం నుండి విడిపోయినా.. ఆ బాధ నుండి బయటపడేందుకు సామ్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆధ్యాత్మిక స్థలాల నుండి వివిధ దేశాలకు సామ్ స్నేహితులతో విహారయాత్రలు చేస్తూ మళ్ళీ సాధారణ జీవితాన్ని ప్రారంభించే పనిలో ఉంది. చైతూ మాత్రం ఎక్కడా బయట కనిపించడం లేదు. బ్రేకప్ అనంతరం ఆ బంధం నుండే కాదు చైతూ గుర్తులను కూడా చెరిపేసి పనిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది సామ్. దీని కోసం గతంలో సోషల్ మీడియాలో పంచుకున్న చైతూ స్వీట్ మెమొరీస్ ను తొలగించేస్తుందట.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

విడిపోతున్నట్లుగా ప్రకటించిన అనంతరం సామ్ తన ఇనిస్టా ఖాతా నుండి చైతూతో కలిసి ఉన్న దాదాపు 80 ఫోటోలను తొలగించేసిందట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలు మినహా సామ్-చైతూ ఇద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను మెల్ల‌గా ఒక్కొకటి తన ఇనిస్టాలో లేకుండా తొల‌గిస్తున్న‌ట్టు స‌మాచారం. కొన్నిరోజులకి తన ఖాతాలో ఎక్కడ చైతూ గుర్తులు లేకుండా చెరిపేయడం ఖాయమంటున్నారు. అయితే.. ఇంటర్నెట్ నిండా ఈ స్టార్ కపుల్స్ ఫోటోలే ఉన్నాయి. మరి వాటిని ఎలా తొలగిస్తుందో ఏమో!

×