Pushpa-Samantha: సామ్ ఊ అంటావా.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Pushpa-Samantha: సామ్ ఊ అంటావా.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

Pushpa Samantha

Pushpa-Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా.. స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డిసెంబర్ 10వ తేదిన విడుదలైన ఈ లిరికల్ సాంగ్ కేవలం 20 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

కాగా.. శుక్రవారం ఊ అంటావా మావా ఫుల్ సాంగ్ విడుదల చేశారు. జనవరి 7న శుక్రవారం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా అంతకు ముందే సమంతా ఐటెం సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. సమంతా గ్లామరస్ ట్రీట్, అల్లు అర్జున్ మాసివ్ స్టెప్స్ తో ఈ పాట దుమ్మురేపుతోంది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్ ఇంద్రావతి ఆలపించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Major: మేజర్ నుంచి ప్రేమ గీతం.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజికల్!