Samantha : సమంత ఐటెం సాంగ్ రేపే…

సమంత ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తుండటం అది కూడా చైతూతో విడాకుల తర్వాత చేయడంతో ఈ సాంగ్ పైన కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఈ సాంగ్‌ షూటింగ్‌ ప్రారంభం కాగా సోమవారంతో.......

Samantha : సమంత ఐటెం సాంగ్ రేపే…

Samantha

Samantha :  అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా చేస్తుంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా నుంచి మొదటి పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ , సాంగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుంది.

RRR Trailer : ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద.. రౌద్రం.. రణం.. రుధిరం..

సమంత ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తుండటం అది కూడా చైతూతో విడాకుల తర్వాత చేయడంతో ఈ సాంగ్ పైన కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఈ సాంగ్‌ షూటింగ్‌ ప్రారంభం కాగా సోమవారంతో ఈ స్పెషల్‌ షాంగ్‌ చిత్రీకరణ పూర్తయింది. తాజాగా సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చారు చిత్ర బృందం. ఇప్పటికే సమంత లుక్స్ ని విడుదల చేసిన ‘పుష్ప’ టీం డిసెంబర్‌ 10న ఈ సాంగ్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

Thiagarajan : స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం.. రోడ్డు మీద అనాధగా మరణం..

ఇప్పటికే రిలీజ్ చేసిన సమంత పోస్టర్ తోనే ఈ ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతుంది, సమంత ఐటెం సాంగ్ లో అదరగొట్టబోతుందని తెలుస్తుంది. ‘ఉ అంటావా.. ఊ అంటావా..’ అంటూ ఈ పాట సాగనుంది. ఇందులో సమంత డ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో వేసిందని సమాచారం. ఇక సుక్కు సినిమాలో ఐటెం సాంగ్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఈ పాటకి కూడా అదిరిపోయేలా DSP తయారు చేసాడని సమాచారం. చాలా గ్యాప్ తర్వాత సమంత నుంచి అప్ డేట్ రావడంతో సమంత అభిమానులు ఎంతగానో ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఐటెం సాంగ్ లో సమంత ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.