Krishna Vrinda Vihari: సాంగ్ రిలీజ్.. ఇదో ముద్దుల వర్షంలో రొమాంటిక్ వెన్నెల!
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సక్సెస్ కోసం చాలాకాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ మధ్యనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య ఈసారి రూటు మార్చి..

Krishna Vrinda Vihari
Krishna Vrinda Vihari: యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సక్సెస్ కోసం చాలాకాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ మధ్యనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య ఈసారి రూటు మార్చి రొమాంటిక్ యాంగిల్ లో రాబోతున్నాడు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.
Krishna Vrinda Vihari: కృష్ణ విందా విహారి ఫస్ట్ లుక్.. నాగశౌర్య ఒడిలో షెర్లీ!
హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. టీజర్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రేక్షకులని పాటలతో అలరించడానికి సిద్ధమైంది. ఈక్రమంలోనే ఈ చిత్రంలో మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ఏప్రిల్9న విడుదల చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ని స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్’ అంటూ ట్వీట్ చేస్తూ సామ్ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Naga Shaurya : వెంకటేష్ కంటే బాగా చూసుకుంటా.. ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ రిలీజ్..
‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్ అద్భుత సంగీతాన్ని అందించాడు. ఎంత రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని ట్యూన్ చేశారో అంతే రొమాంటిక్ గా పాటని చిత్రీకరీంచారనిపిస్తుంది. ఈ పాటలో నాగశౌర్య- షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా ఉంది. కూల్ గా సాగుతూ రొమాంటిక్ ఫీల్ తో పాట వినసొంపుగా ఉంటే.. అందుకు తగ్గట్లే విజువల్ సింపుల్ గా క్యూట్ గా ఉంటూ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.