Samantha : 80 కిలోలని అవలీలగా ఎత్తేసిన సమంత

సమంత గతంలో తన సోషల్ మీడియాలో తాను చేసే ఎక్సర్‌సైజులు అన్ని పోస్ట్ చేసేది. ఇటీవల కాలంలో ఎక్కువగా పోస్ట్ చేయలేదు. మళ్ళీ ఇవాళ తన జిమ్ వీడియోల్ని పోస్ట్ చేసింది. తన ఫిట్‌నెస్..........

10TV Telugu News

Samantha :  సమంత గత కొన్ని నెలలుగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. చైతో విడాకులు, ఆ తర్వాత సమంత పెట్టే కొటేషన్స్, పుష్ప ఐటెం సాంగ్.. ఇలా వరుసగా వార్తల్లో నిలుస్తుంది సామ్. తాజాగా తాను జిమ్ లో చేసిన వీడియో వైరల్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.

సెలబ్రిటీలు రోజూ జిమ్ చేస్తారు. అందులో సమంత కూడా. సమంత గతంలో తన సోషల్ మీడియాలో తాను చేసే ఎక్సర్‌సైజులు అన్ని పోస్ట్ చేసేది. ఇటీవల కాలంలో ఎక్కువగా పోస్ట్ చేయలేదు. మళ్ళీ ఇవాళ తన జిమ్ వీడియోల్ని పోస్ట్ చేసింది. తన ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్‌‌తో కలిసి బరువులెత్తుతున్న వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Chay-Sam : నా బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ సమంతనే : నాగ చైతన్య

వెయిట్ లిఫ్టింగ్ లో 75 కిలోల నుంచి బరువు ఎత్తడం మొదలు పెట్టింది. ఆ తర్వాత 78 కిలోల బరువు ఉన్న వెయిట్ లిఫ్ట్ ని లేపింది. ఆ తర్వాత 80 కిలోల బరువుని కూడా సునాయాసంగా లేపింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. సమంత 80 కిలోల బరువుని సునాయాసంగా లేపడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

×