పెళ్లి కూతురిగా సమంత

  • Published By: vamsi ,Published On : January 17, 2020 / 06:22 AM IST
పెళ్లి కూతురిగా సమంత

అక్కినేని కోడలు సమంత పెళ్లి కూతురిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఓ కమర్షియల్ యాడ్ కోసం మళ్లీ పెళ్లి కూతురి గెటప్ వేసింది.

ఓ కాఫీ బ్రాండ్ యాడ్‌ కోసం సమంత పెళ్లి కూతురి గెటప్ వేసింది. సమంత భర్తగా ప్రముఖ నటుడు మాధవన్ ఈ యాడ్‌లో నటించారు. ఈ తమిళ యాడ్‌లో సమంత ఎరుపు రంగు చీర కట్టుకుని పెళ్లి కూతురిగా ముస్తాబయ్యింది. పెళ్లి కూతురి గెటప్‌లో సమంతను చూడటానికి రెండు కళ్లు చాలడంలేదంటూ అభిమానులు అంటున్నారు.

తన భర్త నాగచైతన్యతో కలిసి రెక్సోనా, బిగ్ బజార్ ప్రకటనల్లో నటించిన సమంత ఇప్పుడు మాధవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న వీళ్లిద్దరు బ్రాండ్‌కి మంచి పేరు తెస్తున్నారు అని ట్విట్టర్ ద్వారా సదరు కంపెనీ అభిప్రాయపడుతూ వీడియోని షేర్ చేసింది. 

సమంత ప్రస్తుతం శర్వాతో ‘జాను’ అనే సినిమాలో నటిస్తుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘96’ సినిమాకు ఇది రీమేక్‌. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తున్నారు. ఇందులో సమంత టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తుంది.