సీనియర్ ఇక్కడ.. నాకు నేనే పోటీ.. నాకెవరూ రారు సాటి..

హైదరాబాద్ టైమ్స్ 2019 - మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. సమంత అక్కినేని..

10TV Telugu News

హైదరాబాద్ టైమ్స్ 2019 – మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.. సమంత అక్కినేని..

పెళ్లి తర్వాత కూడా కథానాయిక సమంత అక్కినేని స్పీడ్ మరింత పెరిగింది. పూజా హెగ్డే, రష్మికా మందన్నా వంటి కుర్ర హీరోయిన్స్ వచ్చాక కూడా  సమంత క్రేజ్ తగ్గలేదు. ‘రంగస్థలం’, ‘యూ టర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబి’, ‘జాను’.. ఇలా సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.

తాజాగా సమంత మరో ఘనతను సొంతం చేసుకుంది. హైదరాబాద్ టైమ్స్ ‘30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’లో సమంత ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకుంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు వయసు గల మహిళలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వేలో సమంత ఎక్కువ ఓట్లు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది.

Read Also : ప్రముఖ నటుడు, దర్శకుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూత..

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న పూజా హెగ్డే ఐదో స్థానం, రష్మికా మందన్నా 9వ స్థానం దక్కించుకోగా.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మూడో స్థానంలో నిలిచింది.

ఇక, ఈ జాబితాలో రకుల్, కాజల్ వరుసగా 7,8 స్థానాల్లో నిలవగా, యాంకర్ శ్రీముఖి 25వ ప్లేస్‌లో నిలిచింది. 
హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019లో నిలిచిన వారిలో..
2. సంజనా విజ్
3. పీవీ సింధూ
4. అదితి రావు హైదరీ
5. పూజా హెగ్డే
6. రాజా కుమారి
7. రకుల్ ప్రీత్ సింగ్
8. కాజల్ అగర్వాల్
9. రష్మిక మందన్నా
10. నిఖితా తన్వాని
14వ స్థానంలో నభా నటేష్
16వ స్థానంలో ఇషా రెబ్బా
25వ స్థానంలో శ్రీముఖి నిలిచారు. 

×