RGV: సామ్-చై విడాకులు.. వర్మ సెలబ్రేషన్స్!

ఇండియాలో ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. ముఖ్యంగా ఎవరైనా విడాకులు తీసుకుంటున్నారని తెలిస్తే చాలు.. అక్కడ వర్మ దూరి లెట్స్ సెలబ్రేట్..

RGV: సామ్-చై విడాకులు.. వర్మ సెలబ్రేషన్స్!

Rgv First Lover

RGV: ఇండియాలో ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. ముఖ్యంగా ఎవరైనా విడాకులు తీసుకుంటున్నారని తెలిస్తే చాలు.. అక్కడ వర్మ దూరి లెట్స్ సెలబ్రేట్ అంటుంటాడు. ఆ మధ్య బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ విడాకుల విషయంలో ఫింగర్ పెట్టేసిన వర్మ.. అమిర్ ఖాన్ విడాకులు తీసుకొని మంచి పనిచేశాడని వెనకేసుకొచ్చాడు. అసలు వాళ్ళు విడిపోతుంటే మీకెందుకు నొప్పి అంటూ వర్మ సోషల్ మీడియాలో నెటిజన్లపై ఓ రేంజిలో రెచ్చిపోయాడు.

Sara Ali Khan: సారా.. నీ అందానికి మనసారా ఫిదా!

ఇక, ఇప్పుడు టాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంతాల విడాకులపై అధికారిక ప్రకటన రావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. వారు విడిపోయేందుకు కారణాలను కూడా సోషల్ మీడియా వేదికగా విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. కానీ వర్మ మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలంటున్నాడు. పెళ్లి అనేది తన దృష్టిలో మరణమన్న వర్మ విడాకులు పునర్జన్మ లాంటిదని.. పునర్జన్మ దక్కినందుకు సెలబ్రేట్ చేసుకోవాలని ట్వీట్ చేశాడు.

RGV: థైస్ బాగున్నాయన్న వర్మ.. చెంప చెళ్లుమనిపించిన అషు!

పెళ్లి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారని.. కానీ అసలు తన దృష్టిలో విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలని వర్మ ఉపోద్ఘాతం చెప్పుకొచ్చాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ ఆ వీడియో లింకును కూడా ట్వీట్ చేశాడు. దీంతో వర్మ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.