Samantha : నేను కూడా రీ రిలీజ్ చేస్తానంటున్న సమంత.. ఉమెన్స్ డే స్పెషల్ ఆ సినిమా రీ రిలీజ్..

సమంత మెయిన్ లీడ్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ఉమెన్స్ డే రోజు రీ రిలీజ్ కానుంది. ఓ కొరియన్ సినిమా నుంచి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత తన పర్ఫార్మెన్స్ తో.................

Samantha : నేను కూడా రీ రిలీజ్ చేస్తానంటున్న సమంత.. ఉమెన్స్ డే స్పెషల్ ఆ సినిమా రీ రిలీజ్..

Samantha Oh Baby movie re release on March 8th women's day special samantha fans waiting

Samantha :  ఇటీవల పలు సూపర్ హిట్ సినిమాలు, స్టార్ హీరోల ఒకప్పటి సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్, రజినీకాంత్, చిరంజీవి, ధనుష్, సిద్దార్థ్.. ఇలా తెలుగు, తమిళ్ లో దాదాపు చాలా మంది స్టార్ హీరోల సినిమాలు స్పెషల్ రోజుల్లో రిలీజయి మరోసారి థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఈ రీ రిలీజ్ కి అభిమానులు కూడా భారీగా వస్తుండటం, కలెక్షన్స్ కూడా వస్తుండటంతో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. తాజాగా హీరోలకంటే నాకేం తక్కువ అంటూ స్టార్ హీరోయిన్ సమంత సినిమా రీ రిలీజ్ కి రాబోతుంది.

సమంత మెయిన్ లీడ్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ఉమెన్స్ డే రోజు రీ రిలీజ్ కానుంది. ఓ కొరియన్ సినిమా నుంచి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేయడంతో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా చివర్లో నాగచైతన్య కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. దీంతో 2019లో రిలీజయిన ఈ సినిమా మంచి హిట్ కొట్టి కలెక్షన్స్ కూడా భారీగానే రప్పించింది.

Krithishetty : బేబమ్మ ఖాతాలో మరో సినిమా.. శర్వానంద్ 35లో కృతి..

ఇప్పుడు సమంత ఓ బేబీ సినిమాని ఉమెన్స్ డే అంటే మార్చ్ 8న రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే కేవలం PVR, Inox థియేటర్స్ లో మాత్రమే ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో PVR, Inox మల్టిప్లెక్స్ లలో ఓ బేబీ స్పెషల్ షోలు వేయనున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ ఈ సినిమా రీ రిలీజ్ కి వెళ్లి మరోసారి దీన్ని సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంది.

View this post on Instagram

A post shared by Gurufilms (@gurufilms1)