Oo Antava Mava: సామ్ ఊ అంటావా మావా.. 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్!

ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ లిస్ట్ టాప్ పదిలో ఐదు పాటలు ఒకే సినిమాలో ఉన్నాయి. శ్రీవల్లీ, ఏయ్ బిడ్డా, నా సామి, దాక్కో దాక్కో మేక ఇలా పుష్ప సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టే.

Oo Antava Mava: సామ్ ఊ అంటావా మావా.. 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్!

Pushpa Samantha

Oo Antava Mava: ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ లిస్ట్ టాప్ పదిలో ఐదు పాటలు ఒకే సినిమాలో ఉన్నాయి. శ్రీవల్లీ, ఏయ్ బిడ్డా, నా సామి, దాక్కో దాక్కో మేక ఇలా పుష్ప సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టే. అయితే.. చివరిగా వచ్చినా ఓ ఊపు ఊపేసేలా వచ్చింది సమంతా పాట. ఊ అంటావా మావా లేక ఊఊ అంటావా మావా అంటూ రచ్చ రచ్చే చేసేసింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఊ అంటావా మావా.. అంతగా సామాన్య ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు అందరికీ ఎక్కేసింది ఈ పాట.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

సమంత చేసిన మొదటి డ్యాన్స్ నంబర్ ఇదే కాగా తొలి పాటతోనే ఊ ఊపు ఊపేసింది. ఈ సినిమాలో బన్నీ-రష్మిక పాత్రలు ఎంత కనెక్ట్ అయ్యాయో.. అంతకంటే ఎక్కువే సమంత ఐటమ్ సాంగ్ సినిమా విడుదలకు ముందే విజయానికి యాడ్ అయింది. ఈ పాట వివాదాస్పదమే కాకుండా పేరడీలకు బాగానే ఉపయోగపడింది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ అవుతోన్న ఈ సామ్ సాంగ్ ఎంతలా పాపులరవుతుందో.. దీనికి పేరడిగా వస్తోన్న పాటలూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. ఊ అంటావా.. ఉ ఉ అంటావా.. ఇప్పుడెక్కడ విన్నా ఇవే లైన్స్ వినిపిస్తున్నాయి.

Telugu Pan India Films: టాలీవుడ్‌పై బాలీవుడ్ ఫోకస్.. తెలుగోడి సత్తా తెలిసిందా?

స్టార్ హీరోల పాటలను మించి ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపిన ఊ అంటావా మావా పాట తాజాగా యూట్యూబ్‌లో కొత్త రికార్డును సృష్టించింది. డిసెంబర్ 10వ తేదిన విడుదలైన ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. కేవలం 20 రోజుల్లోనే ఈ రికార్డును నమోదు చేయడం విశేషం కాగా సామ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్ ఇంద్రావతి ఆలపించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.