Samantha : జీవితంలో చాలా నేర్చుకున్నా.. పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటున్న సమంత

నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే.. లా విషయాలు బాగానే ఉంటాయి. కానీ అన్నీ అలా ఉండవు. కొన్నిసార్లు మీరు ఎంత పోరాటం చేసినా ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు చాలా గట్టిగా.......

Samantha : జీవితంలో చాలా నేర్చుకున్నా.. పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటున్న సమంత

Sam

Samantha :  సమంత మామూలుగానే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక చైతుతో విడాకుల తర్వాత మరింత యాక్టీవ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అన్ని షేర్ చేసుకుంటుంది సామ్. ఇక విడాకుల తర్వాత నుంచి ప్రేమ, పెళ్లి, లైఫ్ కి సంబందించిన కొటేషన్స్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాను పెట్టే ప్రతి కొటేషన్ కూడా చర్చకు దారి తీసేలా ఉంటుంది. సామ్ పెట్టే కొటేషన్స్ తెగిపోయిన వారి వివాహ బంధానికి అన్వయించేలా ఉంటున్నాయి. ఇక నెటిజన్లు కూడా వారికి లింక్ చేస్తూనే వీటిపై చర్చిస్తున్నారు. తాజాగా మరో రెండు కొటేషన్స్ తో మరోసారి అందరు మాట్లాడుకునేలా చేసింది సమంత.

Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి

”నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే.. నేను ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది” అని సమంత ఓ కొటేషన్ ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ఆ తర్వాత ”చాలా విషయాలు బాగానే ఉంటాయి. కానీ అన్నీ అలా ఉండవు. కొన్నిసార్లు మీరు ఎంత పోరాటం చేసినా ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు చాలా గట్టిగా పట్టుకుంటారు కానీ వదిలివేయడం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకుంటారు. అంగీకారం అనేది ఒక చిన్న నిశ్శబ్ద గది” అని మరో కోట్ ని సామ్ షేర్ చేసింది.

Pushpa: షూటింగ్ స్పాట్‌లో ప‌ర్యావ‌ర‌ణంపై బన్నీ రిక్వెస్ట్.. మేకింగ్ వీడియో!

జీవితం నేర్పిన పాఠం, ఎంత పోరాడిన ఓడిపోతాం.. అంటూ సమంత పోస్ట్ చేసిన ఈ సూక్తులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మళ్ళీ తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని కొటేషన్స్ పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.