Chay Sam Breakup : ఆడవాళ్లనే ప్రశ్నిస్తారా?? మగాళ్లని ప్రశ్నించరా?? : సమంత

మీడియా, నెటిజన్లు సమంత సోషల్ మీడియాని ఫోకస్ చేశారు. నాగ చైతన్య నుండి విడిపోతున్న‌ట్టు స‌మంత ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి చాలా మంది ఆమెనే టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Chay Sam Breakup : ఆడవాళ్లనే ప్రశ్నిస్తారా?? మగాళ్లని ప్రశ్నించరా?? : సమంత

Samantha (1)

Chay Sam Breakup :  గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా చై-సామ్ విడాకుల గురించే వినిపిస్తుంది. నాగ చైతన్య చాలా సైలెంట్ అని అందరికి తెలుసు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ పోస్టులు పెట్టడు. చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. విడిపోయేటప్పుడు ఇద్దరూ ఒకే పోస్ట్ పెట్టి విడిపోయారు. ఆ తర్వాత చైతన్య ఇప్పటిదాకా ఒక్క పోస్ట్ కానీ స్టోరీ కానీ పెట్టలేదు. సమంత మాత్రం రోజూ స్టోరీలు పెడుతుంది. మాములు స్టోరీలు అయితే ఎవరూ పట్టించుకోరు కానీ వాళ్ళ జీవితానికి అన్వయించేలా పెడుతూండటంతో మీడియా, నెటిజన్లు సమంత సోషల్ మీడియాని ఫోకస్ చేశారు.

నాగ చైతన్య నుండి విడిపోతున్న‌ట్టు స‌మంత ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి చాలా మంది ఆమెనే టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎఫైర్ అని కొంద‌రు, సినిమాల కోస‌మ‌ని మ‌రి కొంద‌రు, మనీ కోసమని కొందరు ఎందుకు విడిపోయారో ఇలా ఏవేవో కార‌ణాల‌తో స‌మంత‌ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమ‌ర్శిస్తున్నారు. రోజూ తాను పెట్టే పోస్టులు కూడా ఇంకా ప్రశ్నించేలాగానే ఉన్నాయి. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స‌మాజం మ‌గాళ్లని ఎందుకు ప్ర‌శ్నించ‌దు అనే అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

Chay-Sam Breakup : వర్కౌట్ కానప్పుడు విడిపోవడమే బెటర్.. చై-సామ్ విడాకులపై స్పందించిన డైరెక్టర్

స‌మంత త‌న మ‌న‌సులోని బాధ‌ను వ్యక్తపరుస్తుందా అని అనుకుంటున్నారు. మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ఉండే స‌మాజం, మ‌గ‌ళ‌వాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌దు. అంటే మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టేనా అని పోస్ట్ పెట్టింది. నాగచైతన్యని ఎక్కువగా ఎవ్వరూ ప్రశ్నించకపోవటం, సమంతని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించటంతోనే సమంత ఈ పోస్ట్ పెట్టిందా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.