Chay-Sam : చైతూని గుర్తుచేసుకున్న సమంత.. ఇన్‌స్టాలో కలిసి చేసిన సినిమా పోస్టర్

తాజాగా సమంత ఓ పోస్ట్ ని తన స్టోరీలో పెట్టడంతో అందరు ఆనందిస్తున్నారు. సమంత, చైతూ కలిసి చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా మజిలీ. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 సంవత్సరాలు అయింది. దీంతో...

Chay-Sam : చైతూని గుర్తుచేసుకున్న సమంత.. ఇన్‌స్టాలో కలిసి చేసిన సినిమా పోస్టర్

Samantha

 

Chay-Sam :  టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫిల్ కపుల్ సమంత, చైతన్య గత సంవత్సరం విడిపోయిన సంగతి తెలిసిందే. వీరు విడిపోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు, ప్రేక్షకులు, టాలీవుడ్ అంతా షాక్ అయ్యారు. వారి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ విడిపోయారు. వాళ్ళు విడిపోయిన చాలా రోజుల వరకు వీరి గురించే వార్తల్లో, సోషల్ మీడియాలో వినిపించింది. ఇప్పటికి కూడా ఎక్కడో ఒకచోట వీరి గురించే వినిపిస్తుంది.

ఇక చైతూ, సమంత విడిపోయిన తర్వాత ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు, ఎవరి సినిమాల బిజీలో వాళ్ళు ఉన్నారు. వారి సోషల్ మీడియాలో గతంలో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చాలానే ఉండేవి. అయితే చైతూ మాత్రం అవేమి డిలీట్ చేయకుండా అలానే ఉంచాడు. కానీ సమంత తన సోషల్ మీడియాలో చైతూతో ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసి ఆశ్చర్యపరిచింది.

Jacqueline Fernandez : నా దేశం పరిస్థితి అంటూ.. శ్రీలంక సంక్షోభంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరోయిన్

ఇప్పటివరకు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు, పోస్టులు పెట్టలేదు. తాజాగా సమంత ఓ పోస్ట్ ని తన స్టోరీలో పెట్టడంతో అందరు ఆనందిస్తున్నారు. సమంత, చైతూ కలిసి చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా మజిలీ. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 సంవత్సరాలు అయింది. దీంతో సమంత తన ఇన్‌స్టా స్టోరీలో మజిలీ పోస్టర్ ని పెట్టింది. అయితే సమంత సింగిల్ పోస్టర్ పెట్టకుండా, చైతూ సింగిల్ గా ఉన్న పోస్టర్ ని పెట్టింది. ఆ పోస్టర్ లో వెనకాల చైతూ ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్

సమంత ఇలా మజిలీ సినిమా పోస్టర్‌ని చైతూ ఫోటోతో పెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో ఆ సినిమాలో లాగా ఇద్దరు మళ్ళీ కలిసిపోవచ్చు కదా, ఇద్దరు ఆ సినిమాలో లాగా అర్ధం చేసుకొని బతకొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది అయితే అవన్నీ సినిమాల్లోనే రియల్ లైఫ్ వేరు అని అంటున్నారు. మొత్తానికి చైతూతో విడాకుల అనంతరం సమంత వారిద్దరూ కలిసి చేసిన సినిమా పోస్టర్‌ని పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.