Samantha : రూమర్లకు చెక్ పెట్టిన సామ్..

గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తల గురించి ఓ నెటిజన్ ఇన్‌స్టా లైవ్‌లో సమంతను అడగ్గా.. క్లారిటీ ఇచ్చింది..

Samantha : రూమర్లకు చెక్ పెట్టిన సామ్..

Samantha

Samantha: గతకొద్ది రోజులుగా సౌత్ క్వీన్ సమంత గురించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నాగ చైతన్యతో విడిపోబోతోంది.. అక్టోబర్ 6న వెడ్డింగ్ యానివర్శరీ నాడు ఓ క్లారిటీ ఇవ్వబోతుందంటూ వార్తలు హల్ చల్ చేశాయి. గోవాలో ఇంటి కోసం స్థలం కొనుగోలు చేసినట్లు అలాగే ముంబైలో కూడా ఓ ఫ్లాట్ కొని త్వరలోనే అక్కడికి ఫిష్ట్ అవబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయింది.

Chai – Sam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?

అయితే రీసెంట్‌గా ఈ వార్తలపై సామ్ రియాక్ట్ అయింది. తాను ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘సాకి’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించింది.

Samantha : గ్యాంగ్‌తో చిల్ అయిన సమంత..

‘సామ్, మీరు త్వరలో ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. నిజమేనా’ అని అడిగాడు. దానికి సమంత స్పందిస్తూ.. ‘ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదు.. ఈమధ్య ఇలాంటివి చాలా పుట్టుకొచ్చాయి.. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదు.. ఇది కూడా ఒక రూమరే.. నేను హైదరాబాద్ విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదు.. వెళ్లను కూడా’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

Chai – Sam : క్యూట్ కపుల్ కల నెరవేరింది..