ChaySam Break-UP: చైతూతో విడిపోయిన సమంతకు భరణం ఎంతంటే?

అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లుగా విడివిడిగా ఒకే ప్రకటన చేశారు.

ChaySam Break-UP: చైతూతో విడిపోయిన సమంతకు భరణం ఎంతంటే?

Chay Sam

ChaySam Break-UP: అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లుగా విడివిడిగా ఒకే ప్రకటన చేశారు. అధికారికంగా మేమిద్దరం విడిపోతున్నాం.. అని ప్రకటించన తర్వాత ప్రతీ ఒక్కరూ చర్చిస్తున్న ఓ అంశం.. సమంతకు భరణం కింద అక్కినేని ఫ్యామిలీ ఎంత ఇవ్వబోతుంది అనేదే. సమంతకు రూ. 200కోట్ల భరణం ఇవ్వటానికి సిద్ధమయ్యారంటూ.. నాగార్జునే స్వయంగా సమంతకు ఈ ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే, చైతన్య నుంచి భరణం తీసుకునేందుకు సమంత నిరాకరించినట్లుగా తెలుస్తోంది. స్వతంత్ర భావాలు గల మహిళగా.. సెల్ఫ్ మేడ్ ఉమెన్‌గా ఉండేందుకే భరణం తీసుకునేందుకు సమంత అంగీకరించట్లేదని చెబుతున్నారు. నాలుగేళ్ల వివాహ బంధం.. పదేళ్లకు పైగా స్నేహాన్ని డబ్బు తీసుకుని వదులుకోవట్లేదని చెబుతున్నారు. విడాకుల సమయంలో సమంత ఎలాంటి భరణాలు డిమాండ్ చేయట్లేదని, విడిపోయే విషయంలో దంపతులు ఇద్దరూ లెక్కలు చూసుకోవట్లేదని చెప్పారు.

ప్రస్తుతం సమంత వరుస సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. మకాం ముంబైకి మార్చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇద్దరికీ ఓ ఖరీదైన ఫ్లాట్ మాత్రం ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్లాట్ ఖరీదు 35 కోట్లుగా ఉందని.. కొన్నాళ్లుగా సమంత అక్కడే ఉంటుందని, దీంతో ఆ ఇంటిని సమంత పేరిట రిజిస్ట్రర్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, వీరి బ్రేక్ అప్ గురించి సమంత ఫ్యామిలీ కానీ, చైతన్య ఫ్యామిలీ కానీ, ఇప్పటివరకు స్పందించలేదు.