Samantha : చైతూ కోసం సమంత బాలీవుడ్ సినిమాని వద్దనుకుందా??

చైతూతో విడాకుల అనంతరం సమంత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్ గానే మారుతుంది. సమంతకి సంబంధించిన మరో విషయం ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఇటీవల షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా..............

Samantha : చైతూ కోసం సమంత బాలీవుడ్ సినిమాని వద్దనుకుందా??

Samantha

Bollywood :  చైతూతో విడాకుల అనంతరం సమంత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్ గానే మారుతుంది. సమంతకి సంబంధించిన మరో విషయం ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఇటీవల షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాని 2018 లోనే అనౌన్స్ చేసి 2019లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు.

అయితే ఈ సినిమాకి ముందుగా సమంతనే హీరోయిన్ గా అనుకున్నారు. అట్లీ అప్పటికే సమంతతో తేరి, మెర్సల్ సినిమాలు చేసి ఉండటంతో జవాన్ లో షారుఖ్ సరసన కూడా సమంతని అడిగాడట. అప్పటికి సమంత ఇంకా విడాకులు తీసుకోలేదు. సినిమాలు కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటుంది. నాగ చైతన్యతో ఆ సమయంలో డీప్ లవ్ లో ఉండి చైతూకి సమయం కేటాయించాలి అనుకోని ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఈ సినిమా ఒప్పుకుంటే బాలీవుడ్ కి వెళ్ళాలి షూటింగ్స్ కి ముంబై వెళ్ళాలి, చాలా నెలలు చైతూని మిస్ అవ్వాల్సి వస్తుందని నో చెప్పినట్లు సమాచారం.

Ananya Pandey : రష్మిక పాటకు దుబాయ్‌లో స్టెప్పులేస్తున్న లైగర్ భామ..

ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ అయ్యాక విషయం బయటపడింది. దీంతో సమంత చైతూ కోసం బాలీవుడ్ ప్రాజెక్టు వద్దనుకుంది. కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నాక అన్ని భాషల ప్రాజెక్టులు ఒప్పుకుంటుంది అని అభిమానులు అంటున్నారు. మరి కొంతమంది అంత ప్రేమ ఉంటే విడాకులు ఎలా తీసుకున్నారు, మరి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఎలా నటించావు అని నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.