Samantha-Nagachaitanya: మరోసారి పేరు మార్చుకున్న సామ్!

సమంతా మరోసారి తన పేరు మార్చుకుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. ఆ మధ్య సమంతా ఓ బేబీ సినిమా సమయంలో..

Samantha-Nagachaitanya: మరోసారి పేరు మార్చుకున్న సామ్!

Samantha Akkineni

Samantha-Nagachaitanya: సమంతా మరోసారి తన పేరు మార్చుకుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. ఆ మధ్య సమంతా ఓ బేబీ సినిమా సమయంలో బేబీ అక్కినేనిగా తన సోషల్ మీడియా ఖాతాలను మార్చుకోగా చైతూతో విడాకుల రూమర్స్ బయటకి వచ్చిన కొత్తలో కొన్ని ఖాతాలలో పూర్తిగా తన పేరు తొలగించి ఓన్లీ ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే తన ప్రొఫైల్ నేమ్ గా పెట్టుకోగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలలో జస్ట్ సమంత అనే పదాన్ని మాత్రమే ఉంచింది.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

కాగా, ఇప్పుడు మరోసారి నిన్నటి వరకు ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు మళ్ళీ సమంత అని పేరును మార్చింది. శనివారం అధికారికంగా చైతన్యతో విడాకుల అంశాన్ని ధృవీకరించిన సామ్ ఆదివారం ఇలా పేరు మార్చేయడం కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారుతుంది.

Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!

నిజానికి చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. కానీ, ఆ తర్వాత సమంత అక్కినేని, డైవర్స్ రూమర్స్ సమయంలో ఎస్, ఇప్పుడు మళ్ళీ సమంతకి ఫిక్స్ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో వీరి విడాకుల అంశంపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తూ ఎవరికి నచ్చినట్లుగా వారు సమంతాది తప్పని.. చైతూది తప్పని జడ్జిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు.