Samantha: లైఫ్ గురించి సామ్ చెప్పిన కొత్త నిర్వచనం.. పోస్ట్ వైరల్!

అక్కినేని నాగ చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తూనే ఉంది. అది ఆమె విహార యాత్రలు కానీ.. భావాలు కానీ.. మరేదైనా కానీ సామ్..

Samantha: లైఫ్ గురించి సామ్ చెప్పిన కొత్త నిర్వచనం.. పోస్ట్ వైరల్!

Samantha (1)

Samantha: అక్కినేని నాగ చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తూనే ఉంది. అది ఆమె విహార యాత్రలు కానీ.. భావాలు కానీ.. మరేదైనా కానీ సామ్ రోజూ ఇన్ స్టాలో పోస్ట్ ఉండాల్సిందే. చైతూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండగా సమంత మాత్రం తన పరిస్థితులను అన్వయించేలా రోజూ పోస్టులను పెడుతుంది. సమంత పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అమెరికా రచయిత జామీ వారున్‌ కోట్‌ను పోస్ట్‌ చేసింది. ‘మహాసామ్రాజ్యాల్ని నిర్మించుకొని అందరికంటే అధికులుగా ఉండాలనే ఆలోచనతో కాకుండా ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది? గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని అన్వేషించి హాయిని పొందితే ఎలా ఉంటుంది? విజయానికి కొత్త నిర్వచనం తెలుసుకుంటే ఏమనిపిస్తుంది? నీ విలువలకు తగినట్లుగా జీవితాన్ని పొందటం గురించి ఆలోచించడం ఎలా అనిపిస్తుంది?

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఫిల్టర్‌లను తీసివేసి నీదైన దృష్టికోణంలో జీవితాన్ని తరచిచూసి అందులోని శక్తిని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? అత్యాశకు పోకుండా నీకున్న సమయంలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపితే ఏమనిపిస్తుంది? ఇక జరిగింది చాలనుకొని సర్దుకుపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవాలన్నీ ఎంత గొప్పగా ఉంటాయి కదా ’ అంటూ సమంత పోస్ట్‌ చేసింది. సామ్ పోస్ట్ చేయడమే ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ కావడం సహజమే కాగా.. ఇది కూడా అంతే వైరల్ కావడం.. దేని గురించి.. ఎవరి గురించి ఈ పోస్ట్ చేసిందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి.