Samantha: ఇకపై వాటికి నో అంటోన్న సమంత..?

స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు సినిమాలు చేస్తూ రెచ్చిపోతుంది. ఇక గ్లామర్ షోకు కూడా సామ్ ఓకే అనేయడంతో ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని దర్శకనిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు.

Samantha: ఇకపై వాటికి నో అంటోన్న సమంత..?

Samantha Says No To Glamour Show

Samantha: స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు సినిమాలు చేస్తూ రెచ్చిపోతుంది. ఇక గ్లామర్ షోకు కూడా సామ్ ఓకే అనేయడంతో ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని దర్శకనిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు.

Samantha Yashoda : సాలిడ్ అప్డేట్‌తో వచ్చిన యశోద.. పండగ చేసుకుంటున్న సామ్ ఫ్యాన్స్

అయితే, తెలుగు కంటే కూడా సామ్‌కు బాలీవుడ్ ఆపర్స్ ఎక్కువగా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, సమంతకు వస్తున్న ఎక్కువ ఆఫర్లలో గ్లామర్ రోల్స్ ఉండటంతో సామ్‌కు చిర్రెత్తుకొస్తుందట. ప్రతి సినిమాలోనూ కేవలం గ్లామర్ కే ప్రిఫరెన్స్ ఇస్తే, మిగతా పాత్రలు చేయొద్దా అంటూ దర్శకనిర్మాతలను అడుగుతోందట ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే సామ్ తనవద్దకు వచ్చే దర్శకనిర్మాతలకు ఓ కండీషన్ పెట్టిందట. గ్లామర్ షోనే కాకుండా పాత్రల్లో వైవిధ్యం ఖచ్చితంగా ఉంటేనే తాను సినిమా చేస్తానని ఒప్పుకుందట.

Samantha : డబ్బులిచ్చి నంబర్ 1 స్థానాన్ని కొనుక్కున్నాను..

ప్రస్తుతం సమంత లైనప్‌లో పెట్టిన సినిమాలు చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. ఇప్పటికే సమంత నటిస్తున్న శాకుంతలం, యశోద సినిమాల్లో గ్లామర్ షో కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తుందట ఈ బ్యూటీ. ఇక ఖుషీ మూవీలోనూ మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తోందట ఈ బ్యూటీ. అటు బాలీవుడ్‌లో చేస్తున్న వెబ్ సిరీస్ కూడా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో సామ్ గ్లామర్ షోకు నో చెప్పిందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.